
| Movie Name | Gabbar Singh (2012) |
|---|---|
| Director | Harish Shankar |
| Star Cast | Pawan Kalyan, Shruthi Hasan |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Mamta Sharma & Kushi Murali |
| Lyricist | Sahithi |
| Music Label | Aditya Music |
ఏ… కొప్పున పూలెట్టుకొని… బుగ్గన ఏలెట్టుకొని
ఈధంట నేనెళ్తుంటే…
కెవ్వు కేక… నా ఈడంతా… కెవ్వు కేకా
పాపిడి బిళ్ళెట్టుకొని… మామిడి పళ్ళెట్టుకొని
ఊరెంటా నే వెళ్తుంటే…
కెవ్వు కేకా… నా ఊరంతా… కెవ్వు కేకా
ఎసరులాగ మరుగుతోంది… ఒంట్లో కారం
స్పెషల్ మీల్సు లెక్కుంటది… నాతో బేరం
నా ఈడు కొత్తిమీర… నా సోకు కోడి కూర
నువ్ రాక రాక విందుకొస్తే… కోక చాటు పైటేస్తా
కెవ్వు కేకా… నా సామిరంగా… కెవ్ కెవ్ కెవ్ కేకా
కెవ్వు కేకా… దీని తస్సదియ్య… కెవ్వు కేకా
కెవ్వు కేకా… నా సామిరంగా… కెవ్వు కేకా
కెవ్వు కేకా… దీని తస్సదియ్య… కెవ్వు కేకా
ఆఆ… నా అందం ఓ బ్యాంకు… నువ్వు దూరి
నా సోకు దొంగ లాగ… దొచావంటే… ఆ… దోచేస్తే
కెవ్వు కేకా… నీ సోకు మాడ… కెవ్వు కేకా
నా బుగ్గలోని మెరుపుల్తో… అగ్గిపుల్ల రాజేసి
నీ బీడి నే వెలిగిస్తే… ఆ… వెలిగిస్తే
కెవ్వు కేకా… నీ దుంపతెగ… కెవ్వు కేకా
నా టూరింగ్ టాకీసి… రిబ్బన్ కట్టు
కెవ్వు కేకా… నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు… కెవ్వు కేకా
హే చూశారు ట్రైలరు… ఇక చూస్తే ఫుల్ పిక్చరు
మీ ఒంటినిండ చిచ్చురేగి… పిచ్చెక్కి పెడతారు
కెవ్వు కేకా.. నా సామిరంగ… కెవ్వు కేకా
కెవ్వు కేకా… దీని తస్సదియ్య… కెవ్వు కేకా
హే… కొత్త సిల్కు గుడ్డల్లే… గల్ఫుసెంటు బుడ్డల్లె
జలకులిచ్చు నీ జిలుగులే…
అబ్బో కెవ్వు కేకా… ఓ రత్తాలు.. కెవ్వు కేకా
హేయ్ వేడి వేడి లడ్డల్లే… డబుల్ కాటు బెడ్డల్లే…
వాటమైన ఒడ్డింపులే..
కెవ్వు కేకా… ఓ రత్తాలు… కెవ్వు కేకా
హెయ్ జోరు మీద గుర్రాలు… నీ ఊపులే
కెవ్వు కేకా… ఊరు వాడ పందాలు నీ సొంపులే… కెవ్వు కేకా
నే పట్టుకుంటే లాఠీ… పడలేరు ఎవరు పోటి
ఓ గోలి సోడ తాగి… నీతో గొల్లుమంటు పెట్టిస్తా
కెవ్వు కేకా… నా సామిరంగ… కెవ్ కెవ్ కెవ్ కెవ్వు కేకా
కెవ్వు కేకా… దీని తస్సదియ్య… కెవ్వు కెవ్వు కెవ్వు కేకా
Kevvu Keka song is from the Gabbar Singh movie.
Kevvu Keka song was sung by Mamta Sharma & Kushi Murali.
Kevvu Keka song lyrics were written by Sahithi.
Kevvu Keka song music was composed by Devi Sri Prasad.