
| Movie Name | & English - Mogudu |
|---|---|
| Director | Krishna Vamsi |
| Star Cast | Gopichand, Taapsee |
| Music | Babu Shankar |
| Singer(s) | Madhumitha & Babu Shankar |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి అయితే చాలదు
మొగుడువి కూడా కావాలి
మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ
మగువకి హామీ ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమీ మిగలని
నిరుపేదవి అయిపోవాలి
వచ్చే జన్మకి కూడా… నువ్వే కావాలీ
కావాలి కావాలి
నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి
నాకే నీ సర్వం ఇవ్వాలి
పప పపా మమ మగరి మగరి
రిగ మమమమగరిస
స సరి సారిస స సరి సారిగ
పప పపా మమ మగరి మగరి
రిగ మమమమ రిగరిస
స స స ని స స స
ఇంట్లో ఉంటే కొంగు వదలవని
ఇంట్లో ఉంటే కొంగు వదలవని
తిట్టే విరసం గావాలి
గడప దాటితే ఇంకా రావని
పట్టే విరహం కావాలి
నిద్దట్లో నువు కలవరించినా
అది నాపేరే కావాలి
ఔనో కాదో అనుమానంతో
నే మేలుకునే ఉండాలి
నేనే లేని ఒక్క క్షణం
బ్రతకలేవు అనుకోవాలి
అందుకనే వందేళ్ళపాటు
నీ ప్రాణం నాకు ఇవ్వాలి
కావాలీ, ఈ ఈఈ ఈ
కావాలి కావాలి నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి
చీకటినైనా చూడనివ్వనని
చీకటినైనా చూడనివ్వనని
చీరై నను చుట్టేయ్యాలి
చెప్పకూడని ఊసులు చెప్పే
రెప్పల సడి వినగనగాలీ
నాలో తెగువని పెంచేలా
నువ్వు కొంచెం లోకువ కావాలి
నేను రెచ్చిపోతుంటే
ఎంతో అణుకువగా ఒదిగుండాలి
నువ్వంటూ ఏం లేనట్టూ
నాలో కరిగిపోవాలి
చెప్పని తనమే చిట్టి బొమ్మవై
కొత్త కొత్తగా రావాలి
కావాలీ ఈ ఈఈ ఈ ఈ
కావాలి కావాలి… నేనే నీలోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి… నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి అయితే చాలదు
మొగుడువి కూడా కావాలి
మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ
మగువకి హామీ ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమీ మిగలని
నిరుపేదవి అయిపోవాలి
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి
Kavali Kavali song is from the & English - Mogudu movie.
Kavali Kavali song was sung by Madhumitha & Babu Shankar.
Kavali Kavali song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Kavali Kavali song music was composed by Babu Shankar.