
| Movie Name | Pasivadi Pranam , Chiru (1987) |
|---|---|
| Director | A. Kodandarami Reddy |
| Star Cast | Chiranjeevi, Vijayashanti, Sumalatha |
| Music | Chakravarthy |
| Singer(s) | S P Balasubramanyam, S Janaki |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
తద్దినకా తానా తద్దినకా తానా
తద్దినకా తానా తద్దినకా తానా
తద్దినదిన్ తద్దినదిన్
తద్దినదిన్ తద్దినదిన్
కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ
పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాన్ని తగిలేసినాడే
చెమ్మాచెక్కా చేత చిక్క
మంచమల్లె మారిపోయే మంచు కొండలు
మంచిరోజు మార్చమంది మల్లె దండలు
కాశ్మీరులోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ (ఓ సందమామ)
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ (ఓ సందమామ)
తేనీటి వాగుల్లో తెడ్డేసుకో
పూలారబోసేటి ఒడ్డందుకో
శృంగార వీధుల్లో చిందేసుకో
మందార బుగ్గల్ని చిదిమేసుకో
సూరీడుతో ఈడు చలికాచుకో
పొద్దారిపోయాక పొద చేరుకో
గుండెలో నే పాగా గుట్టుగా వేశాకా
గుత్తమైన సోకు నీదే కాదా
అరె తస్సా చెక్కా ఆకు వక్క
ఇచ్చుకోక ముందే… ముట్టె తాంబూలము
పెళ్ళి కాక ముందే… జరిగే పేరంటము
కాశ్మీరులోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ (ఓ సందమామ)
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ (ఓ సందమామ)
సింధూర రాగాలు చిత్రించుకో
అందాల గంధాల హాయందుకో
పన్నీటి తానాలు ఆడేసుకో
పరువాలు నా కంట ఆరేసుకో
కాశ్మీర చిలకమ్మ… కసి చూసుకో
చిలక పచ్చ రైక… బిగి చూసుకో
గూటి పడవల్లోన… చాటుగా కలిశాక
నీటికైనా వేడి పుట్టాలిలే
పూత మొగ్గ లేత బుగ్గ
సొట్టబడ్డ చోట పెట్టు… నీ ముద్దులు
హే, సొంతమైన చోట లేవు… ఏ హద్దులు
అరె, కాశ్మీరులోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ (ఓ సందమామ)
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ (ఓ సందమామ)
పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాన్ని తగిలేసినాడే
చెమ్మాచెక్కా, హా… చేత చిక్క, ఆ
మంచమల్లె మారిపోయే మంచు కొండలు
మంచిరోజు మార్చమంది మల్లె దండలు
Kashmiru Loyalo song is from the Pasivadi Pranam , Chiru movie.
Kashmiru Loyalo song was sung by S P Balasubramanyam, S Janaki.
Kashmiru Loyalo song lyrics were written by Veturi Sundararama Murthy.
Kashmiru Loyalo song music was composed by Chakravarthy.