| Movie Name | & English - Sri Ramulayya Cinema |
|---|---|
| Director | N Shankar |
| Star Cast | Mohan Babu, Soundarya, Harikrishna |
| Music | Vandemataram Srinivas |
| Singer(s) | K J Yesudas |
| Lyricist | Kalekuri Prasad |
| Music Label |
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా
విరిసీ విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారగ
కామాంధులకె బలియై పోయావా
(కర్మభూమిలో పూసిన ఓ పువ్వా
విరిసీ విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారగ
కామాంధులకె బలియై పోయావా)
పారాణింకా ఆరనెలేదు
తోరణాల కళ వాడనెలేదు
(తోరణాల కళ వాడనెలేదు)
పెండ్లి పందిరీ తీయనెలేదు
అప్పగింతలు అవ్వనెలేదు
గలగల పారే… ఓ సెలయేరా, ఆ ఆ
గలగల పారే ఓ సెలయేరా
పెళ్ళి కూతురుగా ముస్తాబయ్యి
శ్మశానానికి కాపురమెళ్ళావా
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా
విరిసీ విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారగ
కామాంధులకె బలియై పోయావా
రాక్షస విలువలు రాజ్యమేలెడి
నరకప్రాయపు సంఘంలోన
(నరకప్రాయపు సంఘంలోన)
మానవధర్మం మంట గలిసెనా
మారణహోమం జరుగుతున్నదా
కళ కళలాడిన ఓ నవ వధువా, ఆ ఆ
కళ కళలాడిన ఓ నవ వధువా
కోకిల మేధం సాగుచున్నదా
జీవనరాగం ఆర్తనాదమాయే
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా
విరిసీ విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారగ
కామాంధులకె బలియై పోయావా
పాలపిట్టలే పాడబాయెనా
పల్లె గుండెలే తల్లడిల్లెనా
(పల్లె గుండెలే తల్లడిల్లెనా)
కదిలే కాలం ఆగిపోయినా
పొడిచే పొద్దుకు గుండె పగిలెనా
పున్నమి రువ్విన వెన్నెల నవ్వా
(పున్నమి రువ్విన వెన్నెల నవ్వా)
కారు మేఘములు కమ్మేశాయా
కాల సర్పమే కోరలు సాచిందా
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా
విరిసీ విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారగ
కామాంధులకె బలియై పోయావా
Karma Bhoomilo song is from the & English - Sri Ramulayya Cinema movie.
Karma Bhoomilo song was sung by K J Yesudas.
Karma Bhoomilo song lyrics were written by Kalekuri Prasad.
Karma Bhoomilo song music was composed by Vandemataram Srinivas.