
| Movie Name | Marana Mrudangam (1988) |
|---|---|
| Director | A. Kodandarami Reddy |
| Star Cast | Chiranjeevi, Radha, Suhasini |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, Susheela |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది… ఓ సందె వెన్నెలా
కలిసిపోయాక ఈ రెండు కన్నులా
మనసుపడిన కథ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా
మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో ఒకే ధ్యాసగా
ఏ ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే
పండించుకోమని తపించగా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూర వీణలా, ఆ ఆ
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
అసలు మతులు చెడి జంటగా
ఏమవుతామో తెలుసా
జతలు కలిసి మనమొంటిగా
ఏమైనా సరిగరిసా
ఏ కోరికో… శృతే మించగా
ఈ ప్రేమలో… ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలో
నీ ప్రేమలేఖలే లిఖించగా
కురిసిపోయింది… ఓ సందె వెన్నెలా
కలిసిపోయాను… నీ వంశధారలా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, ఆ ఆ
కలిసిపోయాను నీ వంశధారలా
Karigipoyanu Karpura Veenala song is from the Marana Mrudangam movie.
Karigipoyanu Karpura Veenala song was sung by S P Balasubramanyam, Susheela.
Karigipoyanu Karpura Veenala song lyrics were written by Veturi Sundararama Murthy.
Karigipoyanu Karpura Veenala song music was composed by Ilayaraja.