
| Movie Name | & English - Geetha Govindam |
|---|---|
| Director | Parasuram |
| Star Cast | Vijay Devarakonda, Rashmika Mandanna |
| Music | Gopi Sundar |
| Singer(s) | Gopi Sundar |
| Lyricist | Sagar |
| Music Label | Aditya Music |
కనురెప్పల కాలంలోనే
కధ మొత్తం మారే పోయిందే
కనుతెరిచి చూసేలోగా
దరిచేరని దూరం మిగిలిందే
ఇన్నాళ్ళూ ఊహల్లో
ఈ నిమిషం శూన్యంలో
మిగిలానే ఒంటరినై
విడిపోయే వేడుకలో
జరిగినదీ వింతేనా, ఆ ఆ
మన పయనం ఇంతేనా, ఆ ఆ
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
కనురెప్పల కాలంలోనే
కధ మొత్తం మారే పోయిందే
కవి ఎవరో ఈ కథకి
ఎవరెవరో పాత్రలకి
తెలియదుగా ఇప్పటికీ
పొడుపు కధే ఎప్పటికీ
మనమంటు అనుకున్నా
ఒంటరిగానే మిగిలున్నా
ఇందరిలో కలిసున్నా
వెలితిని నేను చూస్తున్నా
పొరపాటు ఏదో… తొరబాటు ఏదో
అది దాటలేని… తడబాటు ఏదో
ఎడబాటు చేసే… ఈ గీతను దాటలేవా
హ్మ్ హ్మ్ హ్మ్ హ్మ్
Kanureppala Kaalam song is from the & English - Geetha Govindam movie.
Kanureppala Kaalam song was sung by Gopi Sundar.
Kanureppala Kaalam song lyrics were written by Sagar.
Kanureppala Kaalam song music was composed by Gopi Sundar.