
| Movie Name | Samadhi Kadutunnam Chandalivvandi (1980) |
|---|---|
| Director | Goona Nagendra Prasad |
| Star Cast | Nutan Prasad, Nagabhushanam, PL Narayana, K. Vijaya |
| Music | JV Raghavulu |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Gopi |
| Music Label | Saregama India Limited |
కలహంస నడక దాన
కమలాల కనుల దాన
నీ కనులు… నీలి కురులు
నను నిలువనీకున్నవే, ఏ ఏ
కలహంస నడక దాన, ఆఆ ఆ
చెలిమేని కదలికలా
అవి భరతనాట్యాలు
జవరాలి భంగిమలా
అరుదైన శిల్పాలు
చెలిమేని కదలికలా, ఆ ఆఆ
అవి భరతనాట్యాలు
జవరాలి భంగిమలా, ఆ ఆఆ
అరుదైన శిల్పాలు
కలలు తలపోసి… కళలు కలబోసి
ఎవరు మలిచేరు ఈ రూపం
కలహంస నడక దాన
కమలాల కనుల దాన
నీ కనులు… నీలి కురులు
నను నిలువనీకున్నవే, ఏ ఏ
కలహంస నడక దాన, ఆఆ ఆ ఆ
శ్రీదేవి కోవెలలో… ఈ దేవి నా జతలో
కొలువైన వేళలలో… ఎన్నెన్ని భావనలో
శ్రీదేవి కోవెలలో… ఈ దేవి నా జతలో
కొలువైన వేళలలో… ఎన్నెన్ని భావనలో
చేయి జతకలిపి… గొంతు శ్రుతి కలిపి
ఏకమవుదాము ఈనాడే
కలహంస నడక దాన
కమలాల కనుల దాన
నీ కనులు… నీలి కురులు
నను నిలువనీకున్నవే, ఏ ఏ
కలహంస నడక దాన, ఆఆ ఆఆ ఆ
Kalahamsa Nadaka Dana song is from the Samadhi Kadutunnam Chandalivvandi movie.
Kalahamsa Nadaka Dana song was sung by S P Balasubramanyam.
Kalahamsa Nadaka Dana song lyrics were written by Gopi.
Kalahamsa Nadaka Dana song music was composed by JV Raghavulu.