
| Movie Name | Bahishkarana, Zee5 Original |
|---|---|
| Director | Mukesh Prajapathi |
| Star Cast | Anjali, Ravindra Vijay, Ananya Nagalla |
| Music | Sidharth Sadasivni |
| Singer(s) | PVNS Rohit |
| Lyricist | Purnachary |
| Music Label |
ఆకాశం దాటింది మరి ఓ చిన్న చినుకు
ఈ నేలే చూడాలని వేసే అడుగు
ఎందాకో తెలియందే నీతో పరుగు
నీ చేయి తాకాకే ఏదో వెలుగు
దోబూచులాటేమిటో
ఇపుడు నాలాగ లేనేమిటో
కలా నిజం… ఇలా కలిసి నడవగ
కధే ఇలా మరో మలుపు తిరిగెను
ఇదే కదా ఎదే ఎపుడు తలచెను
ఈనాటి వరకూ…
అదేమిటో నువ్వే ఎదురు నిలవగ
హఠాత్తుగా ఏదో బదులు తెలిసెను
చెరో సగం జతై పడే అడుగులు
నీతోనే మొదలూ…
కోనేటి కలువకు నీతోనే పోలికే ఉంది కదా
నీ చుట్టు చేరిన పంకిలమే మరక పడనీకా
సరదాగా సాగే నీతో ఈ పయనం
గురుతు రాదు నాకు నీ చెంతనుంటే
ఈ సమయం…
రాసున్నదే ఏమిటో…
ఎదురు కానున్నదే ఏమిటో
కలా నిజం… ఇలా కలిసి నడవగ
కధే ఇలా మరో మలుపు తిరిగెను
ఇదే కదా ఎదే ఎపుడు తలచెను
ఈనాటి వరకూ…
అదేమిటో నువ్వే ఎదురు నిలవగ
హఠాత్తుగా ఏదో బదులు తెలిసెను
చెరో సగం జతై పడే అడుగులు
నీతోనే మొదలూ…
Kalaa Nijam song is from the Bahishkarana, Zee5 Original movie.
Kalaa Nijam song was sung by PVNS Rohit.
Kalaa Nijam song lyrics were written by Purnachary.
Kalaa Nijam song music was composed by Sidharth Sadasivni.