| Movie Name | Chaavu Kaburu Challaga (2021) |
|---|---|
| Director | Koushik Pegallapati |
| Star Cast | Kartikeya, Lavanya Tripathi, |
| Music | Jakes Bejoy |
| Singer(s) | Gowtham Bharadwaj, Shashaa Tirupati |
| Lyricist | Koushik Pegallapati, Sanare |
| Music Label | Aditya Music |
పడవై కదిలింది మనసే ఆకాశం వైపే
గొడవే పెడుతూ ఉందే నువ్వు కావాలనే
నువ్వొచ్చావనీ వచ్చావని వచ్చావనీ నా ప్రాణం చెప్పిందే
నిససస నిస సగరిగరిగ నిససస నిస సగరిగరిగ
మా పగపమగరిగరి పా గరిరిగరి
నిససస నిస సగరిగరిగ నిససస నిస సగరిగరిగ
సరిగపనిసరి సా గపగరిసనిప
కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే
నీ తోడే చేరగా తెలిసిందా నేడే
మహారాజై మురిసానే ఆకాశ దేశాన
నీ మాట విన్నాకా ఆఆ
మెరుపల్లే మెరిసానే ఆ నీలిమేఘాన
తెలిసేలా నీదాకా ఆ ఆ
ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే
కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే
చెలిమితో చేరువై వెతికి తెచ్చేసానలా
మనసావాచా మనసిచ్చాగా నీ తలరాతే మార్చేస్తాన చిరునామాగా
కలలో కూడా కలిసుంటాగా ఏ దూరాలు రాలేవడ్డంగా
నిజంగానే మరో లోకం సమీపిస్తోందా
మళ్ళీ నీలా నన్నే కాలం పరీక్షిస్తుందా
బ్రతుకైనా చితికైనా నీ లోపలి హృదయాన్నై నిన్నంటే నేనుంటా
చనిపోయే క్షణమైనా విడిపోని ప్రణయాన్నై నీడల్లే తోడుంటా
ఈ వర్షంలో పురివిప్పే నెమలి వలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలె
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే
కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని