| Movie Name | Amrutha (2002) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Madhavan, Simran, Nandita Das, Keerthana |
| Music | AR Rahman |
| Singer(s) | S.P.Balasubramanyam, Balaram, Rehna, Febi |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
కడసారిది వీడ్కోలు… కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను… కలలోనైనా కనగలమా…
ఆశలు సమాధి చేస్తూ… బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది… ఓ ఓ
కడసారిది వీడ్కోలు… కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను… కలలోనైనా కనగలమా…
ఆశలు సమాధి చేస్తూ… బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది… ఓ ఓ
తల్లి నేలని, పల్లె సీమని… విడతరమా తరమా
తల్లి నేలని, పల్లె సీమని… విడతరమా తరమా
ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము… స్వర్గమివ్వగలదా గలదా..!
జననానికి ఇది మా దేశం… మరణానికి మరి ఏ దేశం..?
జననానికి ఇది మా దేశం… మరణానికి మరి ఏ దేశం..?
కదిలే నదులారా..! కలలే అలలౌనా..!
జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి…
కన్నీటి తెరలలో తల్లి నేలని…
కడసారి పేగు కనలేక కదిలిపోయెనో…
కడసారిది వీడ్కోలు… కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను… కలలోనైనా కనగలమా…
ఆశలు సమాధి చేస్తూ… బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది… ఓ ఓ
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే
పాడే జోలలు పాపల ఏడ్పుల పాలైపోతే…
ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగే…
పూల డోల నిన్నటి నిదర… ముళ్ళు కదా ఇప్పటి నడక
ఉసురే మిగిలుంటే… మరలా దరిచేరమా..!
మనసే మిగిలుంటే… ఒడిలో తలదాచామా..!
తలపే అల్పం… తపనే అధికం
బరువెక్కిన హృదయం… మోసుకునే పోతున్నా
కడసారిది వీడ్కోలు… కన్నీటితో మా చేవ్రాలు
అడవి చెట్లను పావురాళ్ళను… కలలోనైనా కనగలమా…
ఆశలు సమాధి చేస్తూ… బంధాలను బలి చేస్తూ
ప్రాణాలే విడిచి సాగే పయనమిది… ఓ ఓ
Kadasaridi Veedkolu song is from the Amrutha movie.
Kadasaridi Veedkolu song was sung by S.P.Balasubramanyam, Balaram, Rehna, Febi.
Kadasaridi Veedkolu song lyrics were written by Veturi Sundararama Murthy.
Kadasaridi Veedkolu song music was composed by AR Rahman.