
| Movie Name | Pisachi 2 () |
|---|---|
| Director | Myskkin |
| Star Cast | Andrea Jeremiah, Poorna, Santhosh Prathap |
| Music | Karthik Raja |
| Singer(s) | Sid Sriram |
| Lyricist | Pothula Ravikiran |
| Music Label | Saregama Telugu |
కాలమెంత వేగములే
ఆగమంటే ఆగదమ్మా
కళ్ళ ముందు యోగములే
అందుకుంటే అందవమ్మా
దూరాన్నైనా దూరం చేసే దారే లేదంటే
నింగి నేల ఏకం చేసే లోకం తోడుంటే, ఏ ఏఏ
చూడగలిగితే నువు చూడగలవులే
చూసి చూడనట్టుగా మరి ఉండిపోకులే
కాలమెంత వేగములే
ఆగమంటే ఆగదమ్మా
కళ్ళ ముందు యోగములే
అందుకుంటే అందవమ్మా
ఏ ఏ, కొండగాలి కూని రాగమే
ఎన్ని తీరులో
మచ్చికైన ఓ కోయిల మౌనమా
నీళ్లు నిండి నీలి మేఘమే వాన ఆటలో
ఓడిపోని వారెవ్వవరో చెప్పుమా
మంచులాగ కప్పినా కంచెలాగ ఆపినా
కల్లాలు వేసి మనసునాపేయలేరే
విధి రాత అన్నదే
ఎదిరించలేవులే
ఎడబాటు అన్నదే
అలవాటు కాదులే
ఎండమావికెంత దాహమో
మండుటెండల్లో ఉండలేదు
ఎండకు దూరమై కలనైనా
సాగరానికెంత ఇష్టమో గుండెలోతుల్లో
ఒడ్డునైనా చేరక ఉండదే క్షణమైనా
బ్రహ్మ మాట మార్చినా బొమ్మలాట ఆడినా
చుక్కాని లేని పడవ దాటించలేదే
భ్రమలోన బతికితే గమనించలేవులే
గురువంటే ప్రకృతే… గుర్తించవెందుకే
కాలమెంత వేగములే
ఆగమంటే ఆగదమ్మా
కళ్ళ ముందు యోగములే
అందుకుంటే అందవమ్మా
దూరాన్నైనా దూరం చేసే దారే లేదంటే
నింగి నేల ఏకం చేసే లోకం తోడుంటే, ఏ ఏఏ
చూడగలిగితే నువు చూడగలవులే
చూసి చూడనట్టుగా మరి ఉండిపోకులే
కాలమెంత వేగములే
ఆగమంటే ఆగదమ్మా
కళ్ళ ముందు యోగములే
అందుకుంటే అందవమ్మా
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Kaalamentha Vegamule song is from the Pisachi 2 movie.
Kaalamentha Vegamule song was sung by Sid Sriram.
Kaalamentha Vegamule song lyrics were written by Pothula Ravikiran.
Kaalamentha Vegamule song music was composed by Karthik Raja.