
| Movie Name | Ravoyi Chandamam |
|---|---|
| Director | Jayanth C. Paranji |
| Star Cast | Nagarjuna, Anjala Javeri, Keerthi Reddy |
| Music | Mani Sharma |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
ఝుమ్మని ఝుమ్మని
తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝం ఝుమ్మని ఝుమ్మని
తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు
మధుమాసం మనసుకు వచ్చే వేళలో, ఓ ఓఓ
కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు
శుభమంగళ వాద్యలొచ్చే వేళలో
ఝుమ్మని ఝుమ్మని
తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల
కోయిల పాడెను సన్నాయి
ఆకాశానికి తారలు పొదిగిన నా ఆనందంలో
పల్లవించే నా గీతం… పలకరించే సంగీతం
ఆ స్వర్గానికి నిచ్చన వేసిన నా ఆవేశంలో
తరుముకొచ్చే ఉల్లాసం… తలను వంచే కైలాసం
ఒక్కసారి వస్తయ్… తియ్యని క్షణాలెన్నో
ఒక్కటవ్వమంటూ… తీరని రుణాలే
శుభలేఖనుకో నా గీతం
నీ పాదాలకు పారాణద్దిన ఈ పేరంటంలో
దేవతాయే నీ రూపం… దీవెనాయే నా ప్రాణం
వయ్యారాలను ఉయ్యాలూపిన ఈ వైభోగంలో
మౌనమాయే నా భావం… రాగమాయే నీకోసం
మూడుముళ్ళ బంధం
ఏడు జన్మలనుబంధం
వేణువైన నాలో ఆలాపనయిన గానం
ఆశీస్సనుకో అనురాగం
ఝుమ్మని ఝుమ్మని
తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝుమ్మని ఝుమ్మని
తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు
మధుమాసం మనసుకు వచ్చే వేళలో, ఓ ఓఓ
కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు
శుభమంగళ వాద్యలొచ్చే వేళలో
ఝుమ్మని ఝుమ్మని
తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝం ఝుమ్మని ఝుమ్మని
తుమ్మెద మంత్రాలున్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
Jummani Jummani song is from the Ravoyi Chandamam movie.
Jummani Jummani song was sung by S P Balasubramanyam.
Jummani Jummani song lyrics were written by Veturi Sundararama Murthy.
Jummani Jummani song music was composed by Mani Sharma.