
| Movie Name | Baak (2024) |
|---|---|
| Director | Sundar. C |
| Star Cast | Sundar C, Tamannaah, Raashii Khanna |
| Music | Hiphop Tamizha |
| Singer(s) | Raghavi |
| Lyricist | Bharathi Babu |
| Music Label | Think Music India |
రేపు మనకోసం ఉంది కదే
కమ్మగా నిదురపో
ముక్కు మీద కోపం ఎందులకే
నవ్వుతూ నిదురపో…
లోకమేది రాదే నీకంటూ
చక్కగా నిదురపో
ప్రేమపాలు పోసి పెంచుతున్నా
ప్రశాంతంగా నిదురపో…
జో జో జో మధుబాల
జో జో జో మేఘమాల
జో జో జో వరమాలా
జో జో జో… జో జో జో
జో జో జో…
అందనంతగా ఎదగాలి నువ్వూ
నేనెవ్వరో ఈలోకం ఎరిగెనా నువ్వూ
నా బ్రతుకును చూపే భవితవు నువ్వూ
నా పూజకు దొరికిన పుణ్యమె నువ్వూ
నింగి నేల ఉన్నంత వరకు
నీ తోడుగ నేనుంటా
నిన్ను రేయి పగలు కాచుకునే
కులదైవమై నేనుంటా…
నీ నవ్వులలో మైమరచేనే
స్వర్ణమా నా స్వర్ణమా
నీ కన్నీళ్ళని నే తుడుస్తానే
సర్వమా నా సర్వమా…
నీ ఉన్నతికి మురిసేనే
నీ కోసమే నేనుంటానే
నా ఉసురే పోయినా
నీ నీడల్లే నిలిచెనే…
జో జో జో కనుపాప
జో జో జో సిరిపాప ||3||
పైడి తునకా
నిదురపో… వాన చినుకా
నిదురపో నిదురపో నిదురపో
Jo Jo Jo Madhubala song is from the Baak movie.
Jo Jo Jo Madhubala song was sung by Raghavi.
Jo Jo Jo Madhubala song lyrics were written by Bharathi Babu.
Jo Jo Jo Madhubala song music was composed by Hiphop Tamizha.