
| Movie Name | & English - Siri Siri Muvva |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Chandra Mohan, Jaya Prada |
| Music | K V Mahadevan |
| Singer(s) | S P Balasubramanyam & Susheela |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Universal Music Group |
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం… సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఎదలోని సొదలా… ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా… కలల వరదలా
ఎదలోని సొదలా… ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా… కలల వరదలా
చలిత లలిత పద… కలిత కవిత లెగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా
ఝుమ్మంది నాదం… సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
నటరాజ ప్రేయసి… నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి… నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం
కైలాసమే వంగే నీకోసం
ఝుమ్మంది నాదం… సయ్యంది పాదం
మెరుపుంది నాలో… అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో… అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే… ఏడు రంగులుగా
ఝుమ్మంది నాదం
సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
Jhummandi Naadam song is from the & English - Siri Siri Muvva movie.
Jhummandi Naadam song was sung by S P Balasubramanyam & Susheela.
Jhummandi Naadam song lyrics were written by Veturi Sundararama Murthy.
Jhummandi Naadam song music was composed by K V Mahadevan.