Jayalakshmi Varalakshmi Song Lyrics - Annamayya Alivelmanga Vybhavam

Jayalakshmi Varalakshmi Song Lyrics - Annamayya Alivelmanga Vybhavam
Jayalakshmi Varalakshmi Song Lyrics: Jayalakshmi Varalakshmi is a Telugu song from the film Annamayya Alivelmanga Vybhavam.

Jayalakshmi Varalakshmi Song Details

Movie NameAnnamayya Alivelmanga Vybhavam
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Jayalakshmi Varalakshmi Song Lyrics in Telugu

జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి

ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా

అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి

ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా

పాలజలనిధిలోని పసనైన మీఁగడ

మేలిమి తామెరలోని మించువాసన

నీలవర్ణునురముపై నిండిన నిధానమవై

ఏలేవు లోకములు మమ్మేలవమ్మా

అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి

ప్రియురాలవై హరికి బెరసితివమ్మా

చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో

కందువ బ్రహ్మలకాచే కల్పవల్లివో

అందిన గోవిందునికి అండనే తోడునీడై

ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా

అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి

ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా

పదియారు వన్నెలతో బంగారు పతిమా

చెదరని వేదముల చిగురుఁబోడి

యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు

నిధుల నిలిచే తల్లి నీవారమమ్మా

అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి

ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Annamayya Alivelmanga Vybhavam Movie

  1. Jayalakshmi Varalakshmi Song Lyrics

Jayalakshmi Varalakshmi Song FAQ

What movie is Jayalakshmi Varalakshmi song from?

Jayalakshmi Varalakshmi song is from the Annamayya Alivelmanga Vybhavam movie.