Movie Name | Folk song 2 (2025) |
---|---|
Director | |
Star Cast | SHIVA K & SREEYADEEP |
Music | SHIVA K |
Singer(s) | SHIVA K & BATTU SAILAJA |
Lyricist | NARESH NAAR |
Music Label | RINGMUSIC TELUGU |
జాతరకోస్తావా జాను జాకెట్టు ఇప్పిస్తా
జాతరకోస్తావా జాను
మబ్బులు ముసిరేను బావ నీతో నే రాలేను
మబ్బులు ముసిరేను బావ
అరె తోడుగా ఉంటానే జాను భయమే రానీను
తోడుగా ఉంటానే జాను భయమే రానీయ్యను
మబ్బులు ముసిరేను బావ నీతో నే రాలేను
మబ్బులు ముసిరేను బావ
జాతరకోస్తావా జాను జాకెట్టు ఇప్పిస్తా
జాతరకోస్తావా జాను
తోటకు వస్తావా జాను పూలెన్నో కోసిస్తా
తోటకు వస్తావా జాను
తోటకు రాలేను బావ తోడుగా అన్నలున్నారు
తోటకు రాలేను బావ
భయమెందుకే నా జాను వరసకు భవనైతాను
భయమెందుకే నా జాను నేను నీకైనా ఫ్యాను
తోటకు రాలేను బావ తోడుగా అన్నలున్నారు
తోటకు రాలేను బావ
సినిమాకు పోదామే జాను చాటుగా చూసొద్దామే
సినిమాకు పోదామే జాను
సినిమాకు రాలేను బావ మంది చూస్తే రంది నాకు
సినిమాకు రాలేను బావ
రంది పడకే నా జాను నీకు తోడుగా ఉంటాను
రంది పడకే నా జాను నేను నీకై ఉన్నాను
సినిమాకు రాలేను బావ మంది చూస్తే రంది నాకు
సినిమాకు రాలేను బావ
సిరిసిల్ల పోదామే జాను చీరలు కొనిపెడతాను
సిరిసిల్ల పోదామే జాను
చీరలు నాకొద్దు బావ సిరిసిల్ల నేను రాలేను
చీరలు నాకొద్దు బావ
నువ్వు నాతో వస్తే చాలే జాను పూల పల్లకిలో తిప్పుతాను
నువ్వు నాతో వస్తే చాలే జాను పూల పల్లకిలో తిప్పుతాను
చీరలు నాకొద్దు బావ సిరిసిల్ల నేను రాలేను
చీరలు నాకొద్దు బావ
మా ఇంటికి వస్తావా జాను మందిలో మనువాడుతాను
మా ఇంటికి వస్తావా జాను
మా వోళ్ళతో చెప్పుతావా బావ మందిలో మనువాడుతామ
మా వోళ్ళతో చెప్పుతావా బావ
భయమెందుకే నా జాను మీ వాళ్ళతో చెబుతాను
భయమెందుకే నా జాను వరసకు భవనైతాను
బావ బంగారు బావ నీతోనే ఉంటాను
బావ బంగారు బావ