
| Movie Name | Rudrangi, Mohana Bhogaraju |
|---|---|
| Director | Ajay Samrat |
| Star Cast | Jagapathi Babu, Mamta Mohan Das, Divi Vadthya, Vimala Raman |
| Music | Nawfal Raja AIS |
| Singer(s) | Mohana Bhogaraju |
| Lyricist | Abhinaya Srinivas |
| Music Label | T-Series Telugu |
యే వచ్చిందే వచ్చిందే
తయ్యారై వెన్నెల వయ్యారీ
ఓ పోరి…! (ఉమ్మ ఉమ్మ ఉమ్మ)
పుట్ట మీద పాలపిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు కుట్టే జాజిమొగులాలి
పుట్టమీద పాలపిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు గుట్టే జాజిమొగులాలి
మంత్రమేసే మామకొడుకా జాజిమొగులాలి
మందు దంచుకొని రారా జాజిమొగులాలి
పుట్టమీద పాలపిట్ట జాజిమొగులాలి
ముట్టబోతే తేలు గుట్టే జాజిమొగులాలి
పేరుపెట్టి ప్రేమతోని పిలవనంటడే
వాడు ఇగురంగా ఇశ్శారా జేత్తనంటడే
ఏలుబట్టి నలుగుట్ల నడువనంటడే
వాడు ఏమి ఎరుగనట్టు… ఎన్ని వగలుపడతడే
ఒక్కదాన్ని దొరికితే వదులనంటడే
నన్ను బక్కపలుసగున్నవంటు లెక్కలేస్తడే
తిక్కతిక్క పనులెన్నో చెయ్యమంటడే
వాడు పక్కనుంటే జాలు నాకు ఉడకపోతలే
ఇస్సుంట రమ్మంటే… నా ఇంటిదానివంటడే
ఆకురాయి సూపులోడే జాజిమొగులాలి
అందామంత మెరుగుబెట్టే జాజిమొగులాలి
వాడు చూసే సూపులకు జాజిమొగులాలి
కన్నెతనమే కరిగిపాయే జాజిమొగులాలి
యే అర్ధరాత్రి యాదికొస్తే నిద్దరుండదే
వాడు ముద్దు మీద ముద్దు పెడితే పొద్దు పొడువదే
అమ్మతోడు పాడు మనుసు ఆగనంటదే
నాకు వాని మీద పానమంతా గుంజుతుంటదే
రాకరాక వచ్చినాడు… మొన్న రాతిరే
అబ్బ రామసక్కనైన బావ సాటి ఎవ్వరే
కోరి కోరి పెట్టినాడు కొత్త కిరికిరే
వాడు అదుముకుంటే ఆడనంది ఉన్న ఊపిరే
నా తోడే వాడుంటే… ఇగ మస్తు మస్తుగుంటదే
గూడెపోల్ల పిల్లగాడే జాజిమొగులాలి
గుండె కొల్లగొట్టినాడే జాజిమొగులాలి
కన్ను కన్ను కలిపేనంటే జాజిమొగులాలి
ఎన్నులోన వణుకు బుట్టె జాజిమొగులాలి
దొరసాని నవ్వులు సూడే జాజిమొగులాలి
పున్నమోలే పోసినాయే జాజిమొగులాలి
తీగ నడుము సూడబోతే జాజిమొగులాలి
నాగుపాము లెక్క ఊగే జాజిమొగులాలి
Jajimogulali song is from the Rudrangi, Mohana Bhogaraju movie.
Jajimogulali song was sung by Mohana Bhogaraju.
Jajimogulali song lyrics were written by Abhinaya Srinivas.
Jajimogulali song music was composed by Nawfal Raja AIS.