
| Movie Name | Jai Chiranjeeva |
|---|---|
| Director | Vijaya Bhaskar K |
| Star Cast | Chiranjeevi, Bhumika Chawla, Sameera Reddy |
| Music | Mani Sharma |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Chandra Bose |
| Music Label |
జై గణపతి… జై జై జై గణపతి
ఓం జై గణపతి… జై జై జై గణపతి
జై గణపతి… జై జై జై గణపతి
ఓం జై గణపతి… జై జై జై గణపతి
జై జై గణేశా… జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జగణేశా, గణేశా
హాయ్ హాయ్ గణేశా… అడిగేస్తా గణేశా
అభయమివ్వు బుజ్జిగణేశా, గణేశా
లోకం నలుమూలలా …లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా… ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా… పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎక్కి… గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
గణేశా, గమ్ గణపతి
గణేశా, గమ్ గణపతి
గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
జై జై గణేశా జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జ గణేశా, గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా, గణేశా
అభయమివ్వు బుజ్జి గణేశా, గణేశా
లంబోదరా శివా సుతాయా
లంబోదర నీదే దయ
(ఓ, గణగణగణన గణన గణగణ
గణగణగణన గణన గణగణ)
ఓ, లంబోదరా శివా సుతాయా
లంబోదర నీదే దయ… లంబోదర నీదే దయ
నందేమో నాన్నకి… సింహం మీ అమ్మకి
వాహనమై ఉండలేదా..??
ఎలకేమో తమరికి… నెమలేమో తంబికి
రథమల్లే మారలేదా..??
పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా
కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా
ఎందుకు మాకీ హింసామార్గం
ఎదిగేటందుకు అది ఆటంకం
నేర్పర మాకు సోదరభావం
మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా
గణేశా, గమ్ గణపతి
గణేశా, గమ్ గణపతి
గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
జై జై గణేశా జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జ గణేశా, గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా, గణేశా
అభయమివ్వు బుజ్జి గణేశా, గణేశా
చందాలను అడిగిన… దాదాలను దండిగా
తొండంతో తొక్కవయ్యా
లంచాలను మరిగిన… నాయకులను నేరుగా
దంతంతో దంచవయ్యా
ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ
మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా
మాలో చెడునే ముంచాలయ్యా
లోలో అహమే వంచాలయ్యా
నీలో తెలివే పంచాలయ్యా
ఇంతకుమించి కోరేందుకు లేదు దురాశ
గణేశా, గమ్ గణపతి
గణేశా, గమ్ గణపతి
గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
జై జై గణేశా జై కొడతా గణేశా
జయములివ్వు బొజ్జ గణేశా, గణేశా
హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా, గణేశా
అభయమివ్వు బుజ్జి గణేశా, గణేశా
లోకం నలుమూలలా… లేదయ్యా కులాసా
దేశం పలువైపులా ఏదో రభస
మోసం జనసంఖ్యలా… ఉందయ్యా హమేషా
పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా
చిట్టి ఎలుకను ఎక్కి… గట్టి కుడుములు మెక్కి
చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా
గణేశా, గమ్ గణపతి
గణేశా, గమ్ గణపతి
గణేశా, గమ్ గమ్ గమ్ గమ్ గణపతి
గణపతి బప్పా మోరియా… ఆధా లడ్డు ఖాలియా
గణపతి బప్పా మోరియా… ఆధా లడ్డు ఖాలియా
గణపతి బప్పా మోరియా… ఆధా లడ్డు ఖాలియా
గణపతి బప్పా మోరియా… ఆధా లడ్డు ఖాలియా
Jai Jai Ganesha song is from the Jai Chiranjeeva movie.
Jai Jai Ganesha song was sung by S P Balasubramanyam.
Jai Jai Ganesha song lyrics were written by Chandra Bose.
Jai Jai Ganesha song music was composed by Mani Sharma.