
| Movie Name | Srimanthudu |
|---|---|
| Director | Koratala Siva |
| Star Cast | Mahesh Babu, Shruthi Hasan |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Raghu Dixit, Rita |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Aditya Music |
నేల నేల నేల… నవ్వుతోంది నాలా
నట్ట నడిబొడ్డు సురీడులా
వేల వేల వేల… సైన్యమై ఇవ్వాళ
దూసుకెళ్లమంది నాలో కల
సర్ర సర్రా సర్రా… ఆకాశం కోసేసా
రెండు రెక్కలు తొడిగేసా, తొడిగేసా
గిర్ర గిర్రా గిర్రా… భూగోళం చుట్టూరా
గుర్రాల వేగంతో తిరిగేసా, తిరిగేసా
ఏ కొంచం కల్తీలేని… కొత్త చిరుగాలై
ఎగరేసా సంతోషాల జండా, జండా
జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో, హో ఓ ఓ
వెతికా నన్ను నేను… దొరికా నాకు నేను
నాలో నేనే ఎన్నో వేల… వేల మైళ్ళు తిరిగి
పంచేస్తాను నన్ను… పరిచేస్తాను నన్ను
ఎనిమిదిక్కులన్ని పొంగిపోయి ప్రేమై వెలిగి
గుమ్మ గుమ్మా గుమ్మా… గుడెల్ని తాకేలా
గంధాల గాలల్లే వస్తా, హే వస్తా
కొమ్మకొమ్మా రెమ్మా… పచ్చంగ నవ్వేలా
పన్నీటి జల్లుల్నే తెస్తా, హే తెస్తా
ఎడారిని కడలిగ చేస్తా, చేస్తా
జాగో జాగోరే జాగో జాగోరే
జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగోరే
జాగో జాగోరే జాగో, హో ఓ
స్వార్ధం లేని చెట్టు… బదులే కోరనంటూ
పూలు పళ్ళు నీకు నాకు… ఎన్నో పంచుతుందే
ఏమీ పట్టనంటు… బంధం తెంచుకుంటు
మనిషే సాటి మనిషని… చూడకుంటే అర్థం లేదే
సల్ల సల్లా సల్లా… పొంగిందే నా రక్తం
నా చుట్టూ కన్నీరే కంటే, హే కంటే
విల్ల విల్లావిల్లా… అల్లాడిందే ప్రాణం
చేతైన మంచే చేయకుంటే, చేయకుంటే
ఇవ్వాలనిపించదా ఇస్తూ ఉంటే, ఉంటే
జాగో జాగోరే జాగో జాగోరే
జాగో జాగోరే జాగో
జాగో జాగోరే జాగో జాగోరే
జాగో జాగోరే జాగో, హో ఓ… జాగో
Jaago Jaagore Jaago song is from the Srimanthudu movie.
Jaago Jaagore Jaago song was sung by Raghu Dixit, Rita.
Jaago Jaagore Jaago song lyrics were written by Ramajogayya Sastry.
Jaago Jaagore Jaago song music was composed by Devi Sri Prasad.