
| Movie Name | Nari Nari Naduma Murari (1990) |
|---|---|
| Director | A. Kodandarami Reddy |
| Star Cast | Nandamuri Balakrishna, Shobhana, Nirosha |
| Music | KV Mahadevan |
| Singer(s) | S P Balasubramanyam, P Susheela |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
ద్వాపరమంతా సవతుల సంత
జ్ఞాపకముందా గోపాలా..??
కలియుగమందు ఇద్దరి ముందు
శిలవయ్యావే స్త్రీలోల
కాపురాన ఆపదలను ఈదిన శౌరీ
ఏదీ నాకూ చూపవా ఒక దారీ..!!
నారీ నారీ నడుమ మురారీ, ఈ ఈఈ
నారీ నారీ నడుమ మురారీ
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామి
తలమునకలుగా తడిసితివా..!!
చిరుబురులాడేటి శ్రీదేవి… నీ శిరసును వంచిన కథ కన్నా
రుసరుసలాడేటి భూదేవి… నీ పరువును తీసినా కథ విన్నా
గోవిందా, ఆ ఆఆ ఆ… గోవిందా గోవిందా
సాగిందా జోడు మధ్యల సంగీతం
బాగుందా భామలిద్దరి భాగోతం
ఇంటిలోన పోరంటే… ఇంతింత కాదయా
అన్నాడు ఆ యోగి వేమనా
నా తరమా భవసాగరమీదను… అన్నాడు కంచెర్ల గోపన్న
పరమేశా గంగ విడుము… పార్వతి చాలున్
ఆ మాటను విని ముంచకు స్వామీ గంగన్
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో… పతులది వెనకడుగే
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో… పతులది వెనకడుగే
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
భామ కాలు తాకిందా… కృష్ణుడే గోవిందా
అన్నాడు ఆ నంది తిమ్మనా
ఒక మాట ఒక బాణము… ఒక సీత నాదని
అన్నాడు సాకేత రామన్న
ఎధునాథా భామ విడుము… రుక్మిణి చాలున్
రఘునాథా సీతను గొని… విడు శూర్పణఖన్
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ… ఒకతే చాలులే
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ… ఒకతే చాలులే
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామి
తలమునకలుగా తడిసితివా
గోవిందా, ఆ ఆఆ ఆ… గోవిందా గోవిందా
Iruvuru Bhamala Kogililo song is from the Nari Nari Naduma Murari movie.
Iruvuru Bhamala Kogililo song was sung by S P Balasubramanyam, P Susheela.
Iruvuru Bhamala Kogililo song lyrics were written by Acharya Athreya.
Iruvuru Bhamala Kogililo song music was composed by KV Mahadevan.