
| Movie Name | GOOD LUCK Sakhi |
|---|---|
| Director | Nagesh Kukunoor |
| Star Cast | Keerthy Suresh, Aadhi Pinisetty |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Mangli, DSP |
| Lyricist | Shree Mani |
| Music Label | Mango Music |
పూంధీరో పాంకుడా నానోజా గేంకడ
జుమారో దలవాడరో
సాంకడో సాలెరి ఓసపురాయరి
మానేరో వేలా వేరో
ఓ, రంగు రంగు రెక్కలున్న
సీతకోక సిలుకల్లె
సెంగు సెంగు మంటందే మనసు
తొంగి తొంగి సూసేటి
మబ్బు సాటు మెరుపల్లె
పొంగి పొంగి పోతాందే మనసు
ఈ గాలిలో ఏమున్నాదో
రాగాలే తీసింది ప్రాణం
తారారిరో తారారిరో
అని పాటేదో పాడిస్తుందీ ఆనందం
ఇంతందంగా ఉంటుందా ఈ లోకం
ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం
పూంధీరో పాంకుడా నానోజా గేంకడ
జుమారో దలవాడరో
సాంకడో సాలెరి ఓసపురాయరి
మానేరో వేలా వేరో
ఓ, తెల్లవారి జాముల్లో
సన్నజాజి పువ్వల్లే
మురిసి మురిసి పోతాందే మనసు
పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల గాలిపటమల్లే
ఎగసి ఎగసి పడతాందే మనసు
కలలే లేని కన్నుల్లోన
కధలేవో కనిపిస్తున్నాయే
అలలే లేని గుండెల్లోన
గలగలమని పొంగాయే ఆసల అలలే
ఇంతందంగా ఉంటుందా ఈ లోకం
ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం
ఇంద్రలోక భవనాన్నే ఈడ్చుకొచ్చి
ఈ గదిలో మార్చి మళ్ళీ కట్టారో ఏమో
నాయగానము తెలుసు మంత్రగారడి తెలుసు
రెంటి కన్న ఇది ఇంకోటేమో
నీలాకాశం నేలకొస్తే… ఇట్టాగే ఉంటాదో ఏమో
ఈ సంతోషం దాచాలంటే
హృదయాలు ఓ వంద కావాలేమో
ఇంతందంగా ఉంటుందా ఈ లోకం
ఇన్నాళ్లు ఈ మనసుకి తెలియలేదే పాపం
పూంధీరో పాంకుడా నానోజా గేంకడ
జుమారో దలవాడరో
సాంకడో సాలెరి ఓసపురాయరి
మానేరో వేలా వేరో
Inthandamga song is from the GOOD LUCK Sakhi movie.
Inthandamga song was sung by Mangli, DSP.
Inthandamga song lyrics were written by Shree Mani.
Inthandamga song music was composed by Devi Sri Prasad.