| Movie Name | 'Karthikeya' |
|---|---|
| Director | Chandoo Mondeti |
| Star Cast | Nikhil, Swathi Reddy |
| Music | Shekar Chandra |
| Singer(s) | Naresh Iyer & Chinmayi Sripada |
| Lyricist | Krishna Chaitanya |
| Music Label | Aditya Music |
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా ఓఓ నిను చూడలేనో… తెరచాటుగా నిను చూసాను, ఓ
అయువో నువు ఆశవో… నువు వీడనీ తుదిశ్వాసవో
రాయనీ ఓ గేయమో… నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో, ఓఓ
చిరునవ్వే నీకోసం… పుట్టిందనిపిస్తుందే
నీ ప్రేమే పంచావో… ధన్యం అనిపిస్తుంది
పడిపోయా నేనే నీకికా… నువు ఎవరైతే మరి ఏంటికా
ఉందో లేదో తీరిక… ఈ రేయి ఆగాలికా, ఓఓ
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో
పైకెంతో అణుకువగా… సౌమ్యంగా ఉంటుంది
తనతోనే తానుంటే… మతిపోయేలా ఉంది
ఆశుందో లేదో ముందుగా… నువు కలిసావో ఇక పండుగా
ఉన్నావే నువే నిండుగా… నా కలలకే రంగుగా, ఓ ఓహో
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేనో… తెరచాటుగా నిను చూసాను, ఓఓ
అయువో నువు ఆశవో… నువు వీడనీ తుదిశ్వాసవో
రాయనీ ఓ గేయమో… నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో, ఓఓ
ఫిమేల్ వెర్షన్
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో
పరిచయమే పరవశమై… నిను నాతో కలిపింది
రాసుందే జరిగింది… అయినా కలలా ఉంది
ఒకటయ్యాక మీలో ఇక… నీతో ఉంటా మరి నేనికా
లేనేలేదిక తీరిక… ఇది మనసులో కలయిక
ఇంతలో ఎన్నెన్ని వింతలో… అలవాటులో పొరపాటులెన్నెన్నో
Inthalo Ennenni Vinthalo song is from the 'Karthikeya' movie.
Inthalo Ennenni Vinthalo song was sung by Naresh Iyer & Chinmayi Sripada.
Inthalo Ennenni Vinthalo song lyrics were written by Krishna Chaitanya.
Inthalo Ennenni Vinthalo song music was composed by Shekar Chandra.