
| Movie Name | & English - Christian Son |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
ఇళ్లలోన పండుగంట… కళ్ళలోన కాంతులంట
ఎందుకో ఎందుకే కోయిలా… చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచుజల్లి… మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా… చెప్పవే చెప్పవే కోయిలా
ఆ అర్దరాత్రి కాలమందు… వెన్నెల ఆహా
ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా ||2||
జన్మించినాడంట వెన్నెలా… ఈ అవనిలోనంట వెన్నెలా ||2||
హేయ్… ఇళ్లలోన పండుగంట… కళ్ళలోన కాంతులంట
ఎందుకో ఎందుకే కోయిలా… చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచుజల్లి… మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా… చెప్పవే చెప్పవే కోయిలా
హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు… పుట్టినాడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా ||2||
ఆ యూదా దేశమందు వెన్నెల… ఆహా
బెత్లెహేము పురమునందు వెన్నెల… ఓహా ||2||
రాజులకు రాజంట వెన్నెలా… ఆ రాజు యేసంట వెన్నెల ||2||
||ఇళ్లలోన||
ఆహ… తార చూపు దారిలోనే… వచ్చినారు ఎవ్వరే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా ||2||
ఆ… తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా
దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా ||2||
బంగారు సాంబ్రాణి బోళం… తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా ||2||
||ఇళ్లలోన||
ఆ… దివి నుండి ఈ భువికి… వచ్చినాడు ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా ||2||
పాపులైన మనకోసం వెన్నెల… ఆహా
ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా ||2||
పరలోకానికి మార్గం వెన్నెలా… ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా ||2||
||ఇళ్లలోన||
హా… పరలోకం చేరుటకై… నేనేమి చెయ్యాలి కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా ||2||
యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా
పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా ||2||
క్రొత్తగా జన్మించు వెన్నెలా… రక్షణను పొందుకో వెన్నెలా ||2||
ఇళ్లలోన పండుగంట… కళ్ళలోన కాంతులంట
ఎందుకో ఎందుకే కోయిలా… చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచుజల్లి… మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా… చెప్పవే చెప్పవే కోయిలా
Illalona Pandaganta song is from the & English - Christian Son movie.