Hrudayamane Song Lyrics - & English - Pelli Sandadi

Hrudayamane Song Lyrics: Hrudayamane is a Telugu song from the film & English - Pelli Sandadi starring Srikanth, Ravali & Deepti Bhatnagar, directed by K Raghavendra Rao. "Hrudayamane" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Hrudayamane Song Details

Movie Name& English - Pelli Sandadi
DirectorK Raghavendra Rao
Star CastSrikanth, Ravali & Deepti Bhatnagar
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Hrudayamane Song Lyrics in Telugu

హా ఆ ఆ ఆఆ, హృదయమనే కోవెల

తలుపులు తెరిచే తాళం

ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమా

ఆఆ ఆ, త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం

ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమా

అణువణువును చెలిమికి… అంకితమిచ్చును ప్రేమ

తను నిలువునా కరుగుతూ… కాంతి పంచునది ప్రేమ

గగనానికి నేలకి వంతెన వేసిన… వానవిల్లు ఈ ప్రేమ

ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమా

హా ఆ ఆ ఆఆ, హృదయమనే కోవెల

తలుపులు తెరిచే తాళం

ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమా

ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ

తనకొరకు ఏ సిరిని… అడగదు కదా

నవ్వడమే చూపగల… ఈ ప్రేమ

మంటలనే వెన్నెలగా… మార్చును కదా

గాలికి గంధము పూయడమే

పూలకు తెలిసిన ప్రేమసుధ

రాలిన పువ్వుల జ్ఞాపకమే

కాలం చదివే ప్రేమకథ

ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి

మురిసేటి గుణమే ప్రేమా

ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమా

ఆ ఆఆ ఆ, హృదయమనే కోవెల

తలుపులు తెరిచే తాళం

ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమా

ఏ జతనో ఎందుకో విడదీసి

వెంటాడి వేటాడు ఆటే ప్రేమ

మౌనముతో మనసునే శృతిచేసి

రాగాలు పలికించు… పాటే ప్రేమా

శాశ్వత చరితల ఈ ప్రేమ

మృత్యువు ఎరుగని చిరునామా

శ్వాసను మంగళహారతిగా

వెలిగించేదే ఈ ప్రేమ

మరణాన్ని ఎదిరించి..!

మరణాన్ని ఎదిరించి… మరుజన్మగా వచ్చి

మరణాన్ని ఎదిరించి… మరుజన్మగా వచ్చి

కరుణించు వరమే ప్రేమా ఆఆ

ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమా

ఆఆ ఆ ఆఆ, హృదయమనే కోవెల

తలుపులు తెరిచే తాళం

ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమా

ఆ ఆఆ ఆఆ ఆ, త్యాగమనే దేవత సన్నిధి

వెలిగే దీపం… ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమా

Share this Song!

More Songs from & English - Pelli Sandadi Movie

  1. Maa Perati Jamchettu Song Lyrics
  2. Hrudayamane Song Lyrics

Hrudayamane Song FAQ

What movie is Hrudayamane song from?

Hrudayamane song is from the & English - Pelli Sandadi movie.

Who sang Hrudayamane song?

Hrudayamane song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Hrudayamane song lyrics?

Hrudayamane song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Hrudayamane song?

Hrudayamane song music was composed by M M Keeravani.