
| Movie Name | & English - Missing |
|---|---|
| Director | Daara Ramesh Babu |
| Star Cast | Harsha Narra, Nikkesha, Misha Narang |
| Music | Ajay Arasada |
| Singer(s) | Yazin Nizar, Ramya Behra |
| Lyricist | Wasistha Sharma |
| Music Label | Aditya Music |
అయ్యో హయయ్యో… ఇదేమి మాయో
అయోమయంలో అదోరకంగా ఉన్న హాయో
ఎదంతా ఏదో… అయే అమ్మాయో
ఇదెంత వింతో మాటల్లో మోగే ఏ సన్నాయో
ఒకే క్షణంలో కలా నిజంలో
తెలీని మైకం ఇదేమిటో
మనం అయేలా చెరో సగంలా
మరో ప్రపంచం స్వాగతాలు పలుకు వేళ
హోలా హోలా రంగు రంగు ఉత్సవాల తేలా
చాలా కొత్త మిలమిల
హోలా హోలా అంతులేని పరవశాల లీలా
నీలా నన్ను చేరుకుందివాల
అయ్యో హయయ్యో… ఇదేమి మాయో
అయోమయంలో అదోరకంగా ఉన్న హాయో
ఎదంతా ఏదో… అయే అమ్మాయో
ఇదెంత వింతో మాటల్లో మోగే ఏ సన్నాయో
ఏదో దారి నీలా మారి
కొత్త కొత్తగా మెల్లమెల్లగా అల్లరే చేసిందే
నిన్నే కోరి నీతో చేరి
అన్నివైపులా సందడే ఇలా సొంతమై నిలిచిందే
మెరిసే మనసులోన… మురిసే పెనుతుఫానా
హోయి, కొంటె సైగలే… హాయి, అంటున్నాయిలే
వేయి కౌగిలింతలోని సంతకాల తేనెలే
హోలా హోలా రంగు రంగు ఉత్సవాల తేలా
చాలా కొత్త మిలమిల
హోలా హోలా అంతులేని పరవశాల లీలా
నీలా నన్ను చేరుకుందివాల
పనులే చేసి పరదతీసి
చిన్ని గుండెలో కొంటె ఊసులే చెప్పగా చేరానే
కోపం చూసి కళ్ళే మూసి
ఉన్నపాటుగా బుగ్గలే ఇలా ముద్దుల్లో తడిపానే
తగిలే పెదవిలోన తెలిసే తలుపు వీణ
హాయి తీపి సంకెలా హాయి పంచుతుందిలా
వేయి జన్మలైనా నిన్ను వీడిపోనీ నీడలా
హోలా హోలా రంగు రంగు ఉత్సవాల తేలా
చాలా కొత్త మిలమిల
హోలా హోలా అంతులేని పరవశాల లీలా
నీలా నన్ను చేరుకుందివాల
Hola Hola song is from the & English - Missing movie.
Hola Hola song was sung by Yazin Nizar, Ramya Behra.
Hola Hola song lyrics were written by Wasistha Sharma.
Hola Hola song music was composed by Ajay Arasada.