Movie Name | Vidya Vasula Aham (2025) |
---|---|
Director | Manikanth Gelli |
Star Cast | Rahul Vijay, Shivani Rajasekhar |
Music | Kalyani Malik |
Singer(s) | Sunitha, Kalyani Malik |
Lyricist | Kittu Vissapragada |
Music Label | T-Series Telugu |
అ: హే ఎవరో మౌనంగా దాగుంది ఎవ్వరో
ఆ: హే ఎవ్వరో నాకోసం రానుంది ఎవ్వరో
అ: ఎలా ఆరా తీసే దారుందో లేదో
ఆ: పారాకాసి చూడలేము అదృష్టం నా వెంటే
ఉంటే చాలు అనుకోవాలా
అ: అందంగా ఉంటుందా అంటు
ఆశే పడుతుండాలా
అ&ఆ: అందాక ఊహల్లోన
ఊరేగాలా వింతగా
అ: హే
ఆ: హే
అ: ఎవ్వరో
ఆ: ఎవ్వరో
ఆ: నాకోసం రానుంది ఎవ్వరో
అ: రూపురేఖలు చూడాలా
తీరుతెన్నులు కోరాలా
ఇంత ఆలోచనుండాలా
ఆ: నీడలా దరి చేరాలా
హద్దులే గమనించాలా
ఇంత ఆరాట పడనేలా?
అ: వేకువ నుంచి రాతిరి దాకా
వేచి చూస్తుండాలా
కన్నులు మూసి బొమ్మను గీసి
కలలే కంటుండాలా
ఆ: ఇన్నాళ్ళు నాలో లేని
ఇష్టాలే లో లో చేరి
ఇవ్వాలే నిన్ను చూడాలన్న ఆత్రమా
ఆ: పరిచయం లేని మనిషైనా
ముందుగా లేని ప్రేమంతా
పెళ్లి కాగానే కలిగేనా
అ: నిన్నలో ఎంత మందున్నా
కౌగిలింతలు కొత్తేనా
పోల్చి చూస్తుంటే తప్పేగా
ఆ: అందరిలోను దగ్గర ఉన్నా
హుందాగా ఉండాలా
ఒంటరి వేళా హద్దులు మీరి
ముద్దులు దోచెయ్యాలా
అ: సందేహాలన్నీ పోయి
సంతోషాలన్నీ చేరి
స్వర్గంలో ఫిక్సయ్యింది పెళ్లంటారుగా
ఆ: హే కాలమా తీరేనా నాలోనా డైలమా
హలో అంటు నాకే ఎదురౌతాడేమో
ఫ్లో లో పోయే టైపౌతాడు
ఆ: మోమాటం లేకుండా ఉంటె
తప్పనుకుంటాడేమో
అడ్‍జస్టై ఓపిగ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ లే అంటాడో
ఏదేమైనా అయ్యేదేదో కానీరాదు కాలమా