| Movie Name | Ashta Chamma (2008) |
|---|---|
| Director | Mohan Krishna Indraganti |
| Star Cast | Nani Swathi |
| Music | Kalyani Malik |
| Singer(s) | Sri Krishna, Sushma |
| Lyricist | Sirivennela |
| Music Label |
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి ఎందుకు నీతో పేచి ఇచ్చేదేదో ఇచ్చి వచ్చెయ్ నాతో రాజీ
కూలకంటి చూపా కొత్తఏటి చేపా పూలవింటి తూపా దానవ ప్రతాపా
హా బెదరకే పాపా వదలని కైపా
నువ్వు కనబడి కలవరపడి తెగ ఎగసిన మగమనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి కీడెంచి మేలెంచి
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
ఆరా తీసేవాళ్ళు పారా కాసేవాళ్ళు దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
ఎందరిని ఏమారుస్తాం ఇందరజాలం చేస్తాం
తిమ్మిని బమ్మిని చేద్దాం మన్మధమంత్రం వేద్దాం
రేయి లాంటి మైకం కప్పుకుని ఉందాం మాయదారి లోకం కంటపడదందాం
మన ఏకాంతం మనకే సొంతం
అష్టదిక్కులన్నీ దుష్టశక్తులల్లే కట్ట కట్టుకొచ్చి
చుట్టు ముట్టుకుంటే యుద్ధానికి సిద్ధం అనుకొందాం
పద్నాలుగు లోకాలను మొత్తం ముద్దుల్లో ముంచేద్దాం
ఆరా తీసేవాళ్ళు పారా కాసేవాళ్ళు దారంతా ఉంటారు ఔరా జాగ్రత్త
పిల్లకి మెళ్ళో పుస్తె కట్టేదెప్పుడంట పిల్లికి మెళ్ళో గంట కట్టేదెవరంట
చప్పున చెప్పవే చిట్టి చంపకు ఊదరగొట్టి
దగ్గర దగ్గర ఉండి తగ్గదు బాదరబందీ
ఆవురావురంది ఆకలాగనంది ఆవిరెక్కువుంది అంటుకోకు అంది
తట్టుకోడమెల్లా ముట్టుకుంటే ఎల్లా
విస్తరాకు నిండా విస్తరించి ఉన్న విందు చూస్తూ కూడా పస్తులుండమని
ఎవ్వరిదీ శాసించిన పాపం ఎవ్వరిపై చూపిస్తాం కోపం
అయినా పెడతా శాపం
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచి ఎందుకు నీతో పేచి ఇచ్చేదేదో ఇచ్చి వచ్చెయ్ నాతో రాజీ
కూలకంటి చూపా కొత్తఏటి చేపా పూలవింటి తూపా దానవ ప్రతాపా
హా బెదరకే పాపా వదలని కైపా
నువ్వు కనబడి కలవరపడి తెగ ఎగసిన మగమనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి కీడెంచి మేలెంచి
Hello Antoo song is from the Ashta Chamma movie.
Hello Antoo song was sung by Sri Krishna, Sushma.
Hello Antoo song lyrics were written by Sirivennela.
Hello Antoo song music was composed by Kalyani Malik.