
| Movie Name | & English - Aa Okkadi Adakku |
|---|---|
| Director | Malli Ankam |
| Star Cast | Allari Naresh, Faria Abdullah |
| Music | Gopi Sundar |
| Singer(s) | Yasaswi Kondepudi |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label | Saregama Telugu |
ఇష్టాన్ని దాచడమెంతో కష్టం తెలుసునా
కన్నుల్లో కనబడిపోదా ఏదో రోజునా
బయటే పడిపోకు అంటు మదినే ఆపినా
అది నీ మాటల్నే వింటు తలనే ఊపునా…
హమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకీ
కన్నులకే చెప్పేస్తుంది ప్రతి సంగతీ
హమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకీ
కన్నులకే చెప్పేస్తుంది ప్రతి సంగతీ.
తూరుపోకరంటా, పడమరొకరంటా
ఎందాక పయనం ఈ దారిలో
స్నేహమొక వైపు, ప్రేమ ఒక వైపు
ఈ చిన్ని మనసు ఎటు తూగునో
ఎంతెంత చిత్రం, ఏంటి విచిత్రం
బొమ్మొక్కరై, బొరుసొక్కరై
కలిసారు కలవరంటు తెలిసీ…
హమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకీ
బదులివ్వను పొమ్మంటుంది ప్రతి ప్రశ్నకీ.
హమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకీ
బదులివ్వను పొమ్మంటుంది ప్రతి ప్రశ్నకీ
తెలిసింది కొంత, తెలియంది కొంత
తెరపైకి రాదా నిజమన్నదీ
ఇన్నాళ్ళ ముసుగు తొలగిపోయాక
తట్టుకుంటుందా మనసన్నది
అందాల జంట… బాగున్నదంటా
ఏ ఉప్పెనా ఇటు వైపుగా
రాకుండ ఉంటె మంచిదంటా
హమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకీ
చిరునవ్వే నవ్విస్తుంది ప్రతి దానికీ ||2||
Hammammo Enni Gundelu Song Credits
Aa Okkati Adakku Movie Release Date – 03 May 2024
Hammammo Enni Gundelu song is from the & English - Aa Okkadi Adakku movie.
Hammammo Enni Gundelu song was sung by Yasaswi Kondepudi.
Hammammo Enni Gundelu song lyrics were written by Bhaskara Bhatla.
Hammammo Enni Gundelu song music was composed by Gopi Sundar.