| Movie Name | & English - Bombay Priyudu |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | JD Chakravarthy, Rambha |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
ఆగోంకి రాణి ఆయియే అబ్ ఆకాశవాణి ఆయియే
గానోంకి మైన ఆయియే మన్ చాహే సుఖాన గాయియే
ఆఆఆ ఆఅ ఆఆ ఆ ఆఆ ఆ
ఆఆ ఆఆ ఆఆ, గుప్పెడు గుండెను తడితె
దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితె
అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి
అధర కాగితం… నీ మధుర సంతకం
అధర కాగితం… మధుర సంతకం
తాన నాన నాన నాన నా నా
తాన నాన నాన నాన తనన నా న నా
తన తనన నా న నా
తనన నా న నా తాన నాన నా
గుప్పెడు గుండెను తడితే
దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే
అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి
అధర కాగితం… నీ మధుర సంతకం
అధర కాగితం… మధుర సంతకం
స సగసని స… పని స సగసని స
స సగసని స… పని స సగసని స
స సగమప మ… పని స సగమపమ
పపప మమమ గమగస
పపప మమమ గమగని
కిలకిలా కులికితే
ఒంటి పేరే సుందరం
కంటి ముందె నందనం
చిలకలా పలికితే
ఉండి పోదా సంబరం
గుండె కాదా మందిరం
జాబిల్లి జాబు రాసి… నన్నె కోరె పరిచయం
పున్నాగ పూలు పూసే… వన్నె చిన్నె రసమయం
ఎందువల్లో ముందులేని కలవరం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి
అధర కాగితం నీ మధుర సంతకం
అధర కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడితే
దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే
అది చప్పున రమ్మని సంకేతం
తనన తననన తనన తననన
తనన తననన తానన తనన నానా
వలపులా వాలితే
కన్నె పైటే స్వాగతం… కన్న కలలె అంకితం
చెలిమిలా చేరితే
పల్లెసీమే పావనం… పిల్ల ప్రేమే వాయనం
సింధూరపూల వాన నిన్ను నన్ను తడపని
అందాల కోనలోన హాయి రేయి గడపని
కొత్తగున్నా మత్తుగుంది మన జగం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి
అధర కాగితం… నీ మధుర సంతకం
అధర కాగితం… మధుర సంతకం
గుప్పెడు గుండెను తడితే
దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే
అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెదవికేంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి
అధర కాగితం… నీ మధుర సంతకం
అధర కాగితం… మధుర సంతకం
Guppedu Gundenu song is from the & English - Bombay Priyudu movie.
Guppedu Gundenu song was sung by S P Balasubramanyam, Chitra.
Guppedu Gundenu song lyrics were written by Veturi Sundararama Murthy.
Guppedu Gundenu song music was composed by M M Keeravani.