
| Movie Name | Neeku Nenu Naaku Nuvvu |
|---|---|
| Director | Raja Sekhar |
| Star Cast | Uday Kiran, Shreya Saran |
| Music | RP Patnaik |
| Singer(s) | K K, Usha |
| Lyricist | Peddada Murthy |
| Music Label | Aditya Music |
లాలాలాల లాలాలాల
గుమ్మరే గుమ్మరే… ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే
గుమ్మరే గుమ్మరే… ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా… ప్రేమ పుట్టేరే
నేనని నేనే లేనని… నేడిలా నీవే నీనని
గుండెలో ప్రేమలే… పూచనే గులాబీల
గుమ్మరే గుమ్మరే… ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే
ప్రేమంటే ఎరుగని నా మదిలో
తొలి తొలి సందడల్లే అల్లుకున్న తోడు నీదిగా
ప్రాయములే విరిసిన వేళలలో ప్రతి ఒక ఈడు
నేడు తోడు కొరకు వెతుకుతుందిగా
నీ కల నా కల ఏకమైన వేళ
నీ జతే నాకిక లోకమైన వేళా
మనసులే మురిసెలే
వలచినదని మధువని
గుమ్మరే గుమ్మరే ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా ప్రేమ పుట్టేరే
ఒక్కటయే చక్కని వేళలలో
ఇకపై ఇద్దరంటు లేనే లేని
జంట వలపిది
ఇప్పటిదో ముందటి జన్మలదో
మరి మరి కోరి కోరి చేరుకున్న
గొప్ప వరమిది
చెంతకె చేరితే చేతులూరుకోవే
కంచెలే దాటితే పెద్దలూరుకోరే
జతలకే దీపమై వెలుగును కదా ప్రేమలు
గుమ్మరే గుమ్మరే… ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా… ప్రేమ పుట్టేరే
నేనని నేనే లేనని… నేడిలా నీవే నీనని
గుండెలో ప్రేమలే… పూచనే గులాబీల
గుమ్మరే గుమ్మరే… ముద్దు గుమ్మారే
కొత్తగా వింతగా… ప్రేమ పుట్టేరే
Gummare Gummare song is from the Neeku Nenu Naaku Nuvvu movie.
Gummare Gummare song was sung by K K, Usha.
Gummare Gummare song lyrics were written by Peddada Murthy.
Gummare Gummare song music was composed by RP Patnaik.