
| Movie Name | Gandeevam (1994) |
|---|---|
| Director | Priyadarshan |
| Star Cast | ANR, Balakrishna, Roja |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Chitra, Sreekumar MG |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Anand Audio Telugu |
గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణగణా… గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే
వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె
అందమైన బాలుడే తనవాడై
గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణగణా… గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా
ఏటి మనుగడ… కోటి అలలుగ
పొంగు వరదల వేగాన
పడిలేచు అలలకు… తీపి కలలకు
లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళల్లోన… ఎల్లకిల్లా పడ్డట్టున్న
అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మ
అబ్బాయంటే సూరీడమ్మ
ఇంటి దీపమవ్వాలంటా దిక్కుల్లో
ఎవరికి వారే, ఏఏ ఏ
యమునకు నీరే, ఏ ఏ ఏఏ ఏ
రేపు నీరు నావదంట
నావ తోడు రేవుదంట
పంచుకుంటే, ఏ ఏ
గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణగణా… గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా
ప్రేమ ఋతువులు… పూలు తొడిగిన
తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన
బాల సొగసుల బాటల్లో
బుగ్గందాల ఏరు నవ్వే… సిగ్గందాల పిల్ల నవ్వే
బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే… పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పోద్దుల్లో
పరవశమేదో, ఓ ఓఓ ఓ
పరిమళమాయే, ఏఏ ఏ ఏ ఓ ఓ
పువ్వు నవ్వే దివ్వె నవ్వే
జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే
గోరువంక వాలగానే గోపురానికి
స్వరాల గణగణా… గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా… పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే
వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె
అందమైన బాలుడే తనవాడై
Goruvanka Valagane song is from the Gandeevam movie.
Goruvanka Valagane song was sung by S P Balasubramanyam, Chitra, Sreekumar MG.
Goruvanka Valagane song lyrics were written by Veturi Sundararama Murthy.
Goruvanka Valagane song music was composed by M M Keeravani.