
| Movie Name | Ladies Tailor (1986) |
|---|---|
| Director | Vamsi |
| Star Cast | Rajendra Prasad, Archana, Deepa |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam & SP Sailaja |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
గోపీలోల నీ పాల పడ్డమురా… లీలాలోల అల్లాడుతున్నామురా
చన్నీళ్లలో ఉన్నామురా… చిన్నారులం మన్నించరా
భామా భామా… తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరి… చెయ్యేత్తి మొక్కాలమ్మా
అందాక మీ అందాలకు… ఆ దిక్కులే దిక్కమ్మలు
గోపీలోల నీ పాల పడ్డమురా…
కృష్ణా కృష్ణా కృష్ణా… కృష్ణా కృష్ణా కృష్ణా
మచ్చ మచ్చ మచ్చ మచ్చ
కృష్ణా కృష్ణా కృష్ణా… కృష్ణా కృష్ణా కృష్ణా
మచ్చ మచ్చ మచ్చ మచ్చ
జాలిమాలిన ఈగాలి… తేరిపార చూసి వేసే ఈలా
మావిమాటున దాగుంటే… కూతవేసి గువ్వలు నవ్వే గోలా
తరుణిరో… కరుణతో మోక్షం చూపే… కిరణమై నిలిచానే
తనువుతో పుట్టే మాయను… తెలుపగా పిలిచానే
మోక్షం కన్న… మానం మిన్న
నిన్ను మన్ను కన్నులు మూసేనా
గోపీలోల నీ పాల పడ్డమురా…
భామా భామా… తీరాన్ని చేరాలమ్మా
చన్నీళ్లలో ఉన్నామురా… చిన్నారులం మన్నించరా
గోపీలోల నీ పాల పడ్డమురా…
వాడిపోని సిరులెన్నో… పూలు పూచేటి కొమ్మరెమ్మ గుమ్మ
నేనుకోరే ఆ తార… ఏది మీలోన… భామా భామా భామా
తగదురా… ఇది మరి చోద్యం కాదా
సొగసరి గోవిందా… అందరు నీవారేగా… ఒకరితో ముడి ఉందా
చూసే కలలు ఎన్నో ఉన్నా… చూపే హృదయం ఒకటే ఉందమ్మా
గోపీలోల నీ పాల పడ్డమురా… లీలాలోల అల్లాడుతున్నామురా
అందాక మీ అందాలకు… ఆ దిక్కులే దిక్కమ్మలు
భామా భామా… తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరి… చెయ్యేత్తి మొక్కాలమ్మా
Gopi Lola song is from the Ladies Tailor movie.
Gopi Lola song was sung by S P Balasubramanyam & SP Sailaja.
Gopi Lola song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Gopi Lola song music was composed by Ilayaraja.