
| Movie Name | Nivaasi (2019) |
|---|---|
| Director | Satheesh Regalla |
| Star Cast | Shekhar Varma, Viviya |
| Music | Charan Arjun |
| Singer(s) | Narasanna |
| Lyricist | Charan Arjun |
| Music Label | Mango Music |
గల గల్ల పారేటి గంగమ్మ తల్లంటి…
చిన్నారి పొన్నారి ఈ సిట్టి సిలకమ్మ…
ఏ తల్లి కన్నాదో… ఏ ఊరు సిన్నాదో
సిత్రంగా నీకే ఎదురైనాదమ్మ…
ఎన్నడు నువ్ సూడనీ… ఆనందమై ఎదురుగా ఉన్నదీ
ఎందుకో ఈ బంధమే తెలిసినట్టే ఉన్నదీ…
నెర్రె బారిన నేల…. తొలి సినుకు పడగానే
పులకరించినట్టు నీలో…
నింగి వాలు జడల… సింగిడి పువ్వోలె…
కొత్త కొత్త సంబరాలో…
ఏడూ సంద్రాలు దాటొచ్చి… ఈ ఊరు చేరావు…
ఇంకెన్ని సిత్రాలు మునుముందు సూడాలో…
తెలుసా నీకు కొమ్మలపైనా… పువ్వులు పూసే తీరు…
ఏ స్నేహం లేకున్నా… అందరి దాహం తీర్చును…
మా సెలయేరు…
ఈ గాలిలోన అమ్మ జోల ఉన్నది… వినుకోర ఓ బుజ్జి కన్నా
ఈ మన్నులోన నాన్న స్పర్శ ఉన్నది… ఘనమేదిరా దీనికన్నా
కొండకొనే నీకు అండ దండ అయినాది… పరదేశపు పసివాడా
గుండె నిండ పల్లె నిను దాసుకుంటాది… అంత ప్రేమ ఉంది ఈడా
ఆ గగనవీధి వీడి నెలకొచ్చినోడా…
గమనించరా అసలు ఏడుందో నీ జాడ…
Gala Gala Paareti Gangamma song is from the Nivaasi movie.
Gala Gala Paareti Gangamma song was sung by Narasanna.
Gala Gala Paareti Gangamma song lyrics were written by Charan Arjun.
Gala Gala Paareti Gangamma song music was composed by Charan Arjun.