| Movie Name | Mr&Miss |
|---|---|
| Director | Ashok Reddy |
| Star Cast | Gnaneswari Kandregula, Sailesh Sunny |
| Music | Yaswanth Nag |
| Singer(s) | Manisha Eerabathini, Yaswanth Nag |
| Lyricist | Pavan Rachepalli |
| Music Label | Madhura Audio |
ఫ్రీడమ్ చెప్పింది వెల్కమ్… శిఖారు చేస్తూ సాగిపోరా
లోకం రంగుల్ని చూస్తూ… రెక్కల్ని చాచి తేలిపోరా
సొంతం ఏముంది పోరా… రవ్వంత నవ్వే ఆస్తి లేరా
మోక్షం ఇచ్చేది మాత్రం… సంతోషమొక్కటే తెలుసుకోరా
ఓ..కలల్ని కంటూ కాలమే పోయింది… అంటూ ఏడ్వడం వ్యర్ధమే
యే..అలల్ని ఆపే సంద్రమే… లోకాన లేదులే
నీ మొరాలకించేది ఎవ్వడో… ఏ దేవుడూ సూటిగా చెప్పడు
ఈ మనస్సు చెప్పేది ఏమిటో… వింటూ సాగుతుండలా
గుండె గుబులెమో… అంతు చిక్కలేదు
ఉన్నకొద్ది మరింత పెరుగుతూ
పక్కనున్నంత సేపు జాడలేదు
ఉక్కపోతైనా బదులు చెప్పదు
ఎందుకంటే నువ్విష్టమంటూ… అందుకే దగ్గరవ్వమంటూ
ఊరుకుంటే సహించనంటూ…
ఊసులన్ని పూసగుచ్చి… నీ దండ కానా
నీలిమబ్బు ఎక్కడో లేదు… దారి తప్పి రెండు కన్నుల్లో దూరి
పంచదార పలుకుగా మారి… చే సిం ది మాయ
ఫ్రీడమ్ చెప్పింది వెల్కమ్… శిఖారు చేస్తూ సాగిపోరా
లోకం రంగుల్ని చూస్తూ… రెక్కల్ని చాచి తేలిపోరా
సొంతం ఏముంది పోరా… రవ్వంత నవ్వే ఆస్తి లేరా
మోక్షం ఇచ్చేది మాత్రం… సంతోషమొక్కటే తెలుసుకోరా
ఓ..కలల్ని కంటూ కాలమే పోయింది… అంటూ ఏడ్వడం వ్యర్ధమే
యే..అలల్ని ఆపే సంద్రమే… లోకాన లేదులే
నీ మొరాలకించేది ఎవ్వడో… ఏ దేవుడూ సూటిగా చెప్పడు
ఈ మనస్సు చెప్పేది ఏమిటో… వింటూ సాగుతుండలా
Freedom Cheppindhi Welcome song is from the Mr&Miss movie.
Freedom Cheppindhi Welcome song was sung by Manisha Eerabathini, Yaswanth Nag.
Freedom Cheppindhi Welcome song lyrics were written by Pavan Rachepalli.
Freedom Cheppindhi Welcome song music was composed by Yaswanth Nag.