
| Movie Name | Asalu Em Jarigindhante |
|---|---|
| Director | Srinivas Bandari |
| Star Cast | Mahendran, Sri Pallavi |
| Music | |
| Singer(s) | Nayana Nair |
| Lyricist | |
| Music Label |
సంగీతం & సాహిత్యం: చరణ్ అర్జున్
తారాగణం: మహేంద్రన్, శ్రీ పల్లవి
ఆడియో: లహరి మ్యూజిక్ | టీ-సీరీస్
ఎవ్వడు రా.. నువ్వు ఎవ్వడు రా..
ఎవ్వడు రా.. నువ్వు ఎవ్వడు రా..
చుట్టమా పక్కమా.. శత్రువా నేస్తమా
బంధమా భారమా.. అందమైన అపాయమా
ఎక్కడా నిన్ను చూసినట్టుగా..
నాకు ఒక్క గుర్తు కూడా లేదురా…
లెక్కలేనన్నిసార్లు మైండ్ లోకే వచ్చి
రచ్చ రచ్చ చేసి నన్ను చంపుతున్నావు రా…
ఎవ్వడు రా.. నువ్వు ఎవ్వడు రా..
ఎవ్వడు రా.. నువ్వు ఎవ్వడు రా..
నిన్ను ఎప్పుడు కలవలేదు.. కలలోనే తలవలేదు
నీకు నాకు పరిచయాలు ఎక్కడాయరా…
నా ఇరవైఏళ్ళ జీవితాన.. ఏ చిన్న మలుపులోన
నీ జ్ఞాపకాలు లేవు రా..
భరించలేని గుండె కోత నాలోన ఎందుచేత
నరనరాన నీ పేరు పారుతుంది రా…
నీ చూపే ఊపిరాయె.. చూడకుంటే ఆగిపోయే
యుద్ధం జరుగుతోంది రా…
ఇంతగా చెప్పలేనంతగా నీ పైన ఇష్టమెపుడు పెరిగె రా..
హాయిగా ఉన్న నన్ను మాయలోకి లాగి
ఏమి పట్టనట్టు అంత బెట్టు నీకేలరా..
ఎవ్వడు రా.. నువ్వు ఎవ్వడు రా..
ఎవ్వడు రా.. నువ్వు ఎవ్వడు రా..
చుట్టమా పక్కమా.. శత్రువా నేస్తమా
బంధమా భారమా.. అందమైన అపాయమా
ఎవ్వడు రా.. నువ్వు ఎవ్వడు రా..
ఎవ్వడు రా.. నువ్వు ఎవ్వడు రా..
Also Read: Neeli Neeli Aakasham Lyrics
Evvadura song is from the Asalu Em Jarigindhante movie.
Evvadura song was sung by Nayana Nair.