Evaru Rayagalaru Song Lyrics - & English - 'Amma Rajinama' Movi

Evaru Rayagalaru Song Lyrics - & English - 'Amma Rajinama' Movi
Evaru Rayagalaru Song Lyrics: Evaru Rayagalaru is a Telugu song from the film & English - 'Amma Rajinama' Movi starring Sharada, Kaikala Satya Narayana, directed by Dasari Narayana Rao. "Evaru Rayagalaru" song was composed by Chakravarthy and sung by KS Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Evaru Rayagalaru Song Details

Movie Name& English - 'Amma Rajinama' Movi
DirectorDasari Narayana Rao
Star CastSharada, Kaikala Satya Narayana
MusicChakravarthy
Singer(s)KS Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Evaru Rayagalaru Song Lyrics in Telugu

ఎవరు రాయగలరూ

అమ్మ అను మాట కన్నా

కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ

అమ్మ అను రాగం కన్నా

తియ్యని రాగం

అమ్మేగా

అమ్మేగా తొలిపలుకు… నేర్చుకున్న భాషకి

అమ్మేగా ఆదిస్వరం… ప్రాణమనే పాటకి

ఎవరు రాయగలరూ

అమ్మ అను మాట కన్నా… కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ

అమ్మ అను రాగం కన్నా… తియ్యని రాగం

అవతార మూర్తి అయినా

అణువంతే పుడతాడు

అమ్మ పేగు పంచుకునే

అంతవాడు అవుతాడు

అవతార మూర్తైనా

అణువంతే పుడతాడు

అమ్మ పేగు పంచుకునే

అంతవాడు అవుతాడు

అమ్మేగా, అమ్మేగా చిరునామా

ఎంతటి ఘన చరితకీ

అమ్మేగా కనగలదు

అంత గొప్ప అమ్మనీ

ఎవరు రాయగలరూ

అమ్మ అను మాట కన్నా… కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ

అమ్మ అను రాగం కన్నా… తియ్యని రాగం

శ్రీరామ రక్ష అంటూ

నీళ్ళు పోసి పెంచింది

దీర్ఘాయురస్తు అంటూ

నిత్యం దీవించింది

శ్రీరామ రక్ష అంటు

నీళ్ళు పోసి పెంచింది

దీర్ఘాయురస్తు అంటు

నిత్యం దీవించింది

నూరేళ్ళూ, నూరేళ్ళూ ఎదిగి బ్రతుకు

అమ్మ చేతి నీళ్ళతో

నడక నేర్చుకుంది బ్రతుకు

అమ్మ చేతి వేళ్ళతో

ఎవరు రాయగలరూ

అమ్మ అను మాట కన్నా… కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ

అమ్మ అను రాగం కన్నా… తియ్యని రాగం

అమ్మేగా

అమ్మేగా తొలిపలుకు… నేర్చుకున్న భాషకి

అమ్మేగా ఆదిస్వరం… ప్రాణమనే పాటకి

ఎవరు రాయగలరూ

అమ్మ అను మాట కన్నా… కమ్మని కావ్యం

ఎవరు పాడగలరూ

అమ్మ అను రాగం కన్నా… తియ్యని రాగం

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - 'Amma Rajinama' Movi Movie

  1. Evaru Rayagalaru Song Lyrics

Evaru Rayagalaru Song FAQ

What movie is Evaru Rayagalaru song from?

Evaru Rayagalaru song is from the & English - 'Amma Rajinama' Movi movie.

Who sang Evaru Rayagalaru song?

Evaru Rayagalaru song was sung by KS Chitra.

Who wrote Evaru Rayagalaru song lyrics?

Evaru Rayagalaru song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Evaru Rayagalaru song?

Evaru Rayagalaru song music was composed by Chakravarthy.