Evaro Okaru Song Lyrics - Ankuram

Evaro Okaru Song Lyrics - Ankuram
Evaro Okaru Song Lyrics: Evaro Okaru is a Telugu song from the film Ankuram starring Revathi, Sarath Babu, Om Puri, directed by C. Uma Maheswara Rao. "Evaro Okaru" song was composed by Hamsaleka and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Evaro Okaru Song Details

Movie NameAnkuram (1993)
DirectorC. Uma Maheswara Rao
Star CastRevathi, Sarath Babu, Om Puri
MusicHamsaleka
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Evaro Okaru Song Lyrics in Telugu

ఎవరో ఒకరు… ఎపుడో అపుడు

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా

అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

ఆఆఆఆ ఆఅ ఆఅ ఆఅ

మొదటి వాడు ఎప్పుడూ… ఒక్కడే మరీ

మొదటి అడుగు ఎప్పుడూ… ఒంటరే మరీ

వెనుకవచ్చు వాళ్ళకు బాట అయినది

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా… అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ… వేకువ వచ్చినా

అనుకొని కోడి కూత నిదరపోదుగా

జగతికి మేలుకొల్పు మానుకోదుగా

మొదటి చినుకు… సూటిగా దూకిరానిదే

మబ్బుకొంగు చాటుగా… ఒదిగి దాగితే

వానధార రాదుగా నేలదారికీ

ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా… అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

చెదరకపోదుగా చిక్కని చీకటి

మిణుగురు రెక్కచాటు… చిన్ని కాంతికి

దానికి లెక్కలేదు కాళరాతిరీ

పెదవి ప్రమిద నిలపనీ… నవ్వు జ్యోతినీ

రెప్పవెనుక ఆపనీ కంటి నీటినీ

సాగలేక ఆగితే… దారి తరుగునా?

జాలిచూపి తీరమే… దరికి చేరునా

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా… అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

యుగములు సాగినా… నింగిని తాకక

ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా

ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా

ఎంత వేడి ఎండతో… ఒళ్ళు మండితే

అంత వాడి ఆవిరై… వెళ్ళి చేరదా

అంత గొప్ప సూర్యుడు… కళ్ళు మూయడా

నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా

ఎవరో ఒకరు ఎపుడో అపుడు

నడవరా ముందుగా

అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

అటో ఇటో ఎటో వైపు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ankuram Movie

  1. Evaro Okaru Song Lyrics

Evaro Okaru Song FAQ

What movie is Evaro Okaru song from?

Evaro Okaru song is from the Ankuram movie.

Who sang Evaro Okaru song?

Evaro Okaru song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Evaro Okaru song lyrics?

Evaro Okaru song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Evaro Okaru song?

Evaro Okaru song music was composed by Hamsaleka.