
| Movie Name | & English - Mishan Impossible |
|---|---|
| Director | Swaroop RSJ |
| Star Cast | Tapsee, Harsh Roshan, Bhannu Prakashan |
| Music | Mark K Robin |
| Singer(s) | Mark K Robin & Haricharan |
| Lyricist | Sanapati Bharadwaj Patrudu |
| Music Label | Saregama Telugu |
ఏంట్రా అదృష్టం
తెగ తట్టిందా తలుపు
సిట్టి బుర్రల్లో
మరి ఎలిగిందా బలుబు
సద్దేసారో తట్టా బుట్టా
వచ్చేసారో పట్నం ఇట్టా
పొడుగాటి మీ దారి
హనుమంతుడి తోకంత
కొలతెంతో తెలిసేదెట్టా
అరికాళ్ళే అరిగేలా
అది ఆశే మీ వెంటా
వస్తున్న కనలేదంటా
హయ్యో ముందేనాడు
తిరగని తోవలంటా
అయినా జంకే లేని
బుడతలు మీరటా
ఏమీ అర్ధం కానీ
గజిబిజి వింత ఆటంటా
ఏదో అర్ధం అయ్యి
ఆటని ఆడితే తంటా
ఇది ముగ్గురు కుంకల ఎత్తురా
ఇది లెక్కకి అందని తుత్తరా
ఇది ఎక్కడి నిద్దర మత్తురా
ఏమో ఏమో పోదో ఏమో
విధి వంకర టింకర శంకర
కధ ముందుకు దూకని జింకర
కల చిందరవందర గుందిరా
ఆడో ఈడో గమ్యం ఏదో
బుసకొట్టే పెదపాము
ఒగ్గేసిన కుబుసంలా
ప్రతిదాన్ని చూస్తున్నారా
నిజమెంటో తెలిసాక
సరదాగా నవ్వేస్తూ
సర్ సర్లే అనుకుంటారా
వేళాపాళా లేని
వెతుకుడు ఏమిటర్రా
వేళాకోలం ఆడే
జనమిక మారరా
గాలం వేసేం లాభం
చెరువుల చేప లెదర్రా
సాయం చేసే కాలం
కనపడి సావదేంటర్రా
Entra Adhrushtam song is from the & English - Mishan Impossible movie.
Entra Adhrushtam song was sung by Mark K Robin & Haricharan.
Entra Adhrushtam song lyrics were written by Sanapati Bharadwaj Patrudu.
Entra Adhrushtam song music was composed by Mark K Robin.