
| Movie Name | Yesayya |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | |
| Music Label | Christian Tunes |
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా
నీ జననమెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
నీ సృష్టిలో ఈ లోకమే నీవు
మాకు ఇచ్చినా సత్రమయ్యా
నీ సృష్టిలో ఈ లోకమే నీవు
మాకు ఇచ్చినా సత్రమయ్యా
ఆ సత్రములో ఓ యేసయ్యా
నీకు స్థలమే దొరకలేదయ్యా
ఆ సత్రములో ఓ యేసయ్యా
నీకు స్థలమే దొరకలేదయ్యా
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా
నీ జననమెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
నిండు చూలాలు మరియమ్మ తల్లి
నడువలేక సుడివడి పోయేనయ్యా
నిండు చూలాలు మరియమ్మ తల్లి
నడువలేక సుడివడి పోయేనయ్యా
దిక్కుతోచక ఓ యేసయ్యా
పశువుల పాకలో ప్రసవించెనయ్యా
దిక్కుతోచక ఓ యేసయ్యా
పశువుల పాకలో ప్రసవించెనయ్యా
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా
నీ జననమెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
చల్లగాలిలో చాటు లేక
నలుమూలలా చలి పుట్టెనయ్యా
చల్లగాలిలో చాటు లేక
నలుమూలలా చలి పుట్టెనయ్యా
పసికందువై ఓ యేసయ్యా
తల్లి ఒడిలో ఒదిగినావయ్యా
పసికందువై ఓ యేసయ్యా
తల్లి ఒడిలో ఒదిగినావయ్యా
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా
నీ జననమెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
Entha Deenathi Deenamo song is from the Yesayya movie.
Entha Deenathi Deenamo song was sung by S P Balasubramanyam.