
| Movie Name | Shiva , Rgv, Nag, Amala |
|---|---|
| Director | Ram Gopal Varma |
| Star Cast | Nagarjuna, Amala |
| Music | Ilaiyaraaja |
| Singer(s) | S P Balasubramanyam & Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
ఎన్నియల్లో మల్లియల్లో
ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్ళింతల్లో
ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న… హంపి శిల్పాలు
ఒళ్లంటుకుంటే చాలు నాట్యాలు
శృంగార వీణరాగాలే, హోయ్
ఎన్నియల్లో మల్లియల్లో
ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్ళింతల్లో
ఎన్నెన్ని కావ్యాలో
సిగ్గేయగా బుగ్గ మొగ్గ
మందార ధూళే దులిపే, ఏఏ
జారేసినా పైటంచునా
అబ్బాయి కళ్లే నిలిపే
సందిళ్లకే చలివేస్తుంటే
అందించవా సొగసంతా
ఒత్తిళ్లతో ఒలికేస్తుంటే
వడ్డించనా వయసంతా
వెలుగులో కలబడే కలలు కన్నా
తనువులో తపనలే… కదిపినా కథకళిలోన
ఎన్నియల్లో మల్లియల్లో
ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్ళింతల్లో
ఎన్నెన్ని కావ్యాలో
ఈ చీకటే ఓ చీరగా
నా చాటు అందాలడిగే, ఏఏ
ఈ దివ్వెలా క్రీనీడలే
నీ సోకులన్నీ కడిగే
నీ మబ్బుల్లే గుడి కడుతుంటే
జాబిల్లిలా పడుకోనా
తబ్బిబ్బుతో తడబడుతుంటే
నీ గుండెలో నిదరోనా
ఉదయమే అరుణమై ఉరుముతున్నా
చెదరనీ నిదరలో
కుదిరిన పడకలలోన
ఎన్నియల్లో మల్లియల్లో
ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్ళింతల్లో
ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న… హంపి శిల్పాలు
ఒళ్లంటుకుంటే చాలు నాట్యాలు
శృంగార వీణరాగాలే, హోయ్
ఎన్నియల్లో మల్లియల్లో
ఎన్నెన్ని అందాలో
లలలలా లల లాలలా
Enniyallo Malliyallo song is from the Shiva , Rgv, Nag, Amala movie.
Enniyallo Malliyallo song was sung by S P Balasubramanyam & Chitra.
Enniyallo Malliyallo song lyrics were written by Veturi Sundararama Murthy.
Enniyallo Malliyallo song music was composed by Ilaiyaraaja.