
| Movie Name | Erra Sainyam |
|---|---|
| Director | R.Narayana Murthy |
| Star Cast | R.Narayana Murthy, Udaya Bhanu |
| Music | Vandemataram Srinivas |
| Singer(s) | Vandemataram Srinivas |
| Lyricist | Varikuppala Yadagiri |
| Music Label | Lahari Telugu | T-Series |
ఏమున్నదక్కో ఏమున్నదక్కా
ముల్లె సదురుకున్న… ఎల్లి పోతా ఉన్న
ఈ ఊర్లో నాకింక ఏమున్నదక్కో
ఏమున్నదక్కో, ఓ ఓ… ఏమున్నదక్కా
యాడ నుండి కన్ను ఏసెనో, సామి
బుగత భూమి కబ్జా చేసెనో, సామి
బిడ్డ బతుకు బుగ్గి చేసెనో, సామి
గునపాలు గుండెల్లో దింపెనో, సామి
కాళ్ళ ఏళ్ళ పడి మొక్కినా
ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ
కాళ్ళ ఏళ్ళ పడి మొక్కినా
ఈది కుక్కలతోటి పోటి యయ్
బతుకు లూటీ యయ్
ఊరు ఎక్కి దించే బాంచన్
ఏమున్నదక్కో, ఓ ఓ… ఏమున్నదక్కా
అడివి సంపద పట్టుకోని, సామి
సావుకారు కొట్టుకెళ్తే, సామి
ఈతాకు ఇచ్చిండు మాకు, సామి
తాటాకు దొబ్బిండు వాడు, సామి
సబ్బు పౌడరు మోజు పెట్టీ
ఈ ఈఈ ఈఈ ఈ ఆ ఆఆ ఆఆ
సబ్బు పౌడరు మోజు పెట్టీ
రంగు డబ్బల బొమ్మ జూపిండు
కొరివి పెట్టిండు కొంప కూల్చిండు బాంచన్
ఏమున్నదక్కో, ఓ ఓ… ఏమున్నదక్కా
పోడు ఎగసం జెయ్యకుండా, సామి
పూచి పుల్ల ముట్టకుండా, సామి
కట్టడంటూ గవర్నమెంటు, సామి
పొట్ట మీద కొట్టుతుంటే, సామి
అడివిబిడ్డలమయ్యి ఉండీ
ఈ ఈ ఈఈ ఈ ఆ ఆ ఆఆ ఆ
అడివిబిడ్డలమయ్యి ఉండీ
ఆకలాకాలంటు అర్చినం
అంగలార్చినం బాధకోర్చినం బాంచన్
ఏమున్నదక్కో, ఓ ఓ… ఏమున్నదక్కా
నేతలెందరో మారినా, సామి
రాత గీత మారలేదులే, సామి
లోకాలనేలేటి దేవుడు, సామి
శాపాలు పెట్టేను కామోసు, సామి
పులులు సింహాలను గెలిచినా
ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
పులులు సింహాలను గెలిచినా
మానవ మృగమును గెలవకా
ఎదురు నిలవకా ఓడిపోయినాం బాంచాన్
ఏమున్నదక్కో ఏమున్నదక్కా
ఏమున్నదక్కో ఏమున్నదక్కా
ముల్లె సదురుకున్న… ఎల్లి పోతా ఉన్న
ఈ ఊర్లో నాకింక ఏమున్నదక్కో
ఏమున్నదక్కో, ఓ ఓ… ఏమున్నదక్కా
ఏమున్నదక్కో ఏమున్నదక్కా
Emunnadakko song is from the Erra Sainyam movie.
Emunnadakko song was sung by Vandemataram Srinivas.
Emunnadakko song lyrics were written by Varikuppala Yadagiri.
Emunnadakko song music was composed by Vandemataram Srinivas.