
| Movie Name | Charan Arjun Father |
|---|---|
| Director | Suresh Surya |
| Star Cast | BVM Ganesh Reddy, Harsha, U.S Vijay |
| Music | |
| Singer(s) | Charan Arjun |
| Lyricist | Charan Arjun |
| Music Label |
ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు
కష్టాన్నే తను మోస్తూ నిను పెంచుకుంటాడు
తను చేరని తీరాలే నిను చేర్చాలనుకుంటాడు
తనకందని ఆనందం… నీకందితె చాలనుకుంటాడు
ఏమిచ్చావని ఏమిచ్చావని
నిందించకురా నాన్నను
ఈ భూమ్మీద ఏ సిరినించునురా
తానిచ్చిన ఈ జన్మను
ఇష్టంగా గుండెకు తన్నించుకుంటాడు
కష్టాన్నే తను మోస్తూ నిను పెంచుకుంటాడు
ఏదైనా గాయం అవగానే
అమ్మ అనడం సహజం
ఆ గాయం మానే మందుకొనే
నాన్ననసలు గుర్తించం
ఏదైనా గాయం అవగానే
అమ్మ అనడం సహజం
ఆ గాయం మానే మందుకొనే
నాన్ననసలు గుర్తించం
నువు నింగిన ఎగిరే గాలిపటం
నిన్నెగరేసేదే అమ్మరా
మీ ఇద్దరికీ ఆధారమయి
కనిపించని దారం నాన్న
తను ఎక్కుతు ఆపిన ఆ తుది మెట్టే
నీ తొలి అడుగుర కన్నా
నువ్వెంతెత్తెదిగిన నీ వెనక
ఘనమైన పునాదే నాన్న
ఏమిచ్చావని ఏమిచ్చావని
నిందించకురా నాన్నను
ఈ భూమ్మీద ఏ సిరినించునురా
తానిచ్చిన ఈ జన్మను
నీ గెలుపును పదిమందికి తెలిపి
పులకించే పసి హృదయం
ఓటమి నిను ఒంటరి చేస్తున్నా
ఓదార్చే తొలి నేస్తం
నీ గెలుపును పదిమందికి తెలిపి
పులకించే పసి హృదయం
ఓటమి నిను ఒంటరి చేస్తున్నా
ఓదార్చే తొలి నేస్తం
తన రెక్కలు ముక్కలు చేసుకొని
నిను చెక్కెనురా శిల్పంగా
తను విత్తనమేసి పెంచాడు
ఎదగాలి నువే వృక్షంగా
నువ్విచ్చిందే తిరిగొస్తది
నాన్నకు ప్రేమను ఇవ్వర కన్నా
ఇది గుర్తుంచుకొని జీవించు
నువ్ రేపింకొకడికి నాన్న
ఏమిచ్చావని ఏమిచ్చావని
నిందించకురా నాన్నను
ఏమిచ్చావని ఏమిచ్చావని
నిందించకురా నాన్నను
ఈ భూమ్మీద ఏ సిరినించునురా
తానిచ్చిన ఈ జన్మను
ఈ భూమ్మీద ఏ సిరినించునురా
తానిచ్చిన ఈ జన్మను
చేరని తీరాలే
నిను చేర్చాలనుకుంటాడు
తనకందని ఆనందం
నీకందితే చాలనుకుంటాడు
ఏమిచ్చావని ఏమిచ్చావని
నిందించకురా నాన్నను
ఈ భూమ్మీద ఏ సిరినించునురా
తానిచ్చిన ఈ జన్మను
ఇష్టంగా గుండెలపై
తన్నించుకుంటాడు
కష్టాన్నే తను మోస్తూ
నిను పెంచుకుంటాడు
Emichavani Nindinchakura song is from the Charan Arjun Father movie.
Emichavani Nindinchakura song was sung by Charan Arjun.
Emichavani Nindinchakura song lyrics were written by Charan Arjun.