
| Movie Name | |
|---|---|
| Director | Sasi |
| Star Cast | Venkatesh, Twinkle Khanna |
| Music | Mani Sharma |
| Singer(s) | Hariharan |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
ఏమని చెప్పను ప్రేమా… ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే… నా తీరాలమ్మా
ఏమని చెప్పను ప్రేమా… ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే… నా తీరాలమ్మా
ఉదయాల సాయంకాలం… హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునా తీరం… ఎదలోన మురళీగానం
ఓ ఓఓ, అలసట చెందిన కలలకు
చందనమలదిన ఆశల్లో
నా మౌనభాషల్లో నీ కంటిబాసల్లో
నీవు నాకు నేను నీకు
లోకం అంకితాలు చేసుకున్న శోకం ప్రేమే అనుకోనా
ఏ కంటిపాప చూడలేని స్వప్నం
మనసులోన దాగి ఉన్న గానం నీదే ఏమైనా
ఒక తోడు కోరే ప్రాణం… ఎద నీడకేలే పయనం
హృదయాలు కోరే గమ్యం… వెదికే ప్రేమావేశం
ఏమని చెప్పను ప్రేమా… ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే… నా తీరాలమ్మా
ఓ ఓ ఓ హో హో, విరహపు యాతన విడుదల కోరిన
మనసుల జంటల్లో… శ్రీరస్తు గంటల్లో శృంగార పంటల్లో
కౌగిలింత చేరుకున్న కాలం
కాలమంటుకోని వింత యోగం మనదే అనుకోనా
హే, కాంచనాల కన్నె చిలక పలికే
కలవరింత కంటినీరు చిలికే సమయాలొచ్చేనా
ఆ రాధకే నా గానం… ఆరాధనే నా ప్రాణం
నా గాధ ఇకపై మౌనం… ఇది నా జీవనరాగం
ఏమని చెప్పను ప్రేమా… ఎగిరే చిలకమ్మా
అందని ఆకాశాలే నా తీరాలమ్మా
ఉదయాల సాయంకాలం… హృదయాల సంధ్యారాగం
ఒక రాధ యమునా తీరం… ఎదలోన మురళీగానం
Emani Cheppanu Prema song is from the movie.
Emani Cheppanu Prema song was sung by Hariharan.
Emani Cheppanu Prema song lyrics were written by Veturi Sundararama Murthy.
Emani Cheppanu Prema song music was composed by Mani Sharma.