| Movie Name | & English - Mr Pregnant |
|---|---|
| Director | Srinivas Vinjanampati |
| Star Cast | Syed Sohel Ryan, Roopa Koduvayur, Suhasini |
| Music | Shravan Bharadwaj |
| Singer(s) | Yazin Nizar |
| Lyricist | Shubham Viswanath |
| Music Label | Mic Tv |
ఏమైనదో ఏమైనదో తెలిపేదెలా
నా ఎదలో, ప్రేమన్నదే తొలిసారిగా
చూసానిలా నీ జతలో
నీ పిలుపు కాదా మధురం
ఈ మలుపు పేరే ప్రణయం
నీ కనులు కంటూ నయనం
నను మరిచిపోయే హృదయం
ఏమైనదో ఏమైనదో తెలిపేదెలా
నా ఎదలో, ప్రేమన్నదే తొలిసారిగా
చూసానిలా నీ జతలో
కదిలే కాలాన్నే ఆపానే
ఇదిగో ఈ జన్మ రాసానే
వెతికా నన్నింకా నీలోనే
కలలే కంటాను నీతోనే
నేనిప్పుడే నీ గుండెపై
చేశానుగా తొలి సంతకం
ఇక ఎప్పుడూ నీలో సగం నేనే కదా
కనులెప్పుడూ గుర్తించనీ
నీ కలలనే నేనీ క్షణం
కన్నానులే నీ ధ్యాసలో నాలోకమే నీవై
పుడమిని తాకి మురిసిపోదా
కరిగిన మబ్బు మొదటిసారి
మానసిక తెలిసి కలిసి పోదా
చెరిసగమైన కొత్త దారి
ముడిపడమంటూ సాగిపోదా
త్వరపడుతున్న ప్రేమ కోరి
పరిచయమంతా మారిపోదా
పరిణయమల్లే నిను చేరి
ఏమైనదో ఏమైనదో తెలిపేదెలా
నా ఎదలో, ప్రేమన్నదే తొలిసారిగా
చూసానిలా నీ జతలో
నీ పిలుపు కాదా మధురం
ఈ మలుపు పేరే ప్రణయం
నీ కనులు కంటూ నయనం
నను మరిచిపోయే హృదయం
Emainado song is from the & English - Mr Pregnant movie.
Emainado song was sung by Yazin Nizar.
Emainado song lyrics were written by Shubham Viswanath.
Emainado song music was composed by Shravan Bharadwaj.