
| Movie Name | & English - Ela Cheppa |
|---|---|
| Director | Ramana B.V |
| Star Cast | Tarun, Shreya |
| Music | Koti |
| Singer(s) | Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
ఈ క్షణం ఒకే ఒక కోరిక… నీ స్వరం వినాలని తియ్యగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక… నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో… ఓఓ ఓ ఓ
తెలియని దారులలో… ఓఓ ఓ ఓ
ఎక్కడున్నావు అంటోంది ఆశగా
ఈ క్షణం ఒకే ఒక కోరిక… నీ స్వరం వినాలని తియ్యగా
ఎన్ని వేల నిమిషాలో… లెక్కపెట్టుకుంటోంది
ఎంతసేపు గడపాలో… చెప్పదేమి అంటోంది
నిన్ననేగా వెళ్ళావన్న సంగతి… గుర్తేలేని గుండె ఇది
ఆ ఆఆ ఆఆఆ… ఆ ఆఆ ఆఆ
మళ్ళీ నిన్ను చూసేదాక… నాలో నన్ను ఉండనీక
ఆరాటంగా కొట్టుకున్నది
ఈ క్షణం ఒకే ఒక కోరిక… నీ స్వరం వినాలని తియ్యగా
రెప్పవేయనంటోంది… ఎంత పిచ్చి మనసు ఇది
రేపు నువ్వు రాగానే… కాస్త నచ్చచెప్పు మరి
నిన్నా మొన్నా… చెప్పుకున్న ఊసులే
మళ్ళీ మళ్ళీ తలచుకుని… ఆ ఆఆ ఆఆఆ… ఆ ఆఆ ఆఆ
ఇంకా ఎన్నో ఉన్నాయంటూ… ఇప్పుడే చెప్పాలంటూ
నిద్దరోను అంటోంది…
ఈ క్షణం ఒకే ఒక కోరిక… నీ స్వరం వినాలని తియ్యగా
తరగని దూరములో… ఓఓ ఓ ఓ
తెలియని దారులలో… ఓఓ ఓ ఓ
ఎక్కడున్నావు అంటోంది ఆశగా..!!
Ee Kshanam Oke Oka Korika song is from the & English - Ela Cheppa movie.
Ee Kshanam Oke Oka Korika song was sung by Chitra.
Ee Kshanam Oke Oka Korika song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Ee Kshanam Oke Oka Korika song music was composed by Koti.