Edi Radu Neeto Paatu Janapadam Song Lyrics

Edi Radu Neeto Paatu Janapadam Song Lyrics
Edi Radu Neeto Paatu Janapadam Song Lyrics: Edi Radu Neeto Paatu Janapadam is a Telugu song.

Edi Radu Neeto Paatu Janapadam Song Details

Movie Name
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Edi Radu Neeto Paatu Janapadam Song Lyrics in Telugu

Edi Radu Neeto Paatu Janapadam Lyrics In Telugu

ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి…

కాటిలోన కాలే కట్టెకు నీకు చివరి సోపతి…

ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి…

కాటిలోన కాలే కట్టెకు నీకు చివరి సోపతి…

ఇల్లు అంటూ.. పిల్లలంటూ.. సంపదంటూ.. సాగిపోతవ్…

ఇల్లు అంటూ.. పిల్లలంటూ.. సంపదంటూ.. సాగిపోతవ్…

బతికున్న కాలం భాద్యతలతో బందీగా మిగిలిపోతవ్…

ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి…

కాటిలోన కాలే కట్టెకు నీకు చివరి సోపతి…

ప్రేమ పంచి పెంచుకున్నా పిల్లలెవరికి సొంతమో…

మూడు ముళ్ళ బంధమళ్ళిన ఆలికి పుట్టెడు శోకమో…

నువ్వు ఆశతోని కూడబెట్టిన సంపదుందా నీతో…

ఆదుకున్న పేరు మాత్రం కాటివరకు ప్రేమతో…

ఎంతకాలం బ్రతికినామనే గొప్ప కాదురా మనిషికి…

ఎంతకాలం బ్రతికినామనే గొప్ప కాదురా మనిషికి…

ఎంత మంది ప్రేమ పొందినావన్నదే చివరికీ…

ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి…

కాటిలోన కాలే కట్టెకు నీకు చివరి సోపతి…

కులము కులమనే తండ్లాటలు ఎందుకయ్యా ఓ నరుడా…

ఎంతపెద్ద కులము అయినా బండెడు కట్టెల పరుపురా…

ఉన్నవాడని లేని వాడని తేడా ఎరుగదు నేలరా…

ఎవనికైనా బొందలోతు వెడెల్పు ఒక్కటే సోదరా…

ఎంత ఉన్నా ఏది ఉన్నా ఏమి లాభం తదుపరి…

ఎంత ఉన్నా ఏది ఉన్నా ఏమి లాభం తదుపరి…

ఇష్టమైనవి ఎన్ని పెట్టినా పిట్టకే కదా చివరికి…

ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి…

కాటిలోన కాలే కట్టెకు నీకు చివరి సోపతి…

వంద ఇండ్లు బతికే శక్తి ఎవరికుంది ఇక్కడ…

ముప్పై ఏండ్లకే మూటెడు మందులు మింగే తనువు మనదిరా…

ఈ ఆరుపదుల జీవితానికి ఆరాటాలే ఎన్నిరా…

తన మన అనే తేడా లేక స్వార్ధమేనక పరుగురా…

సచ్చిపోతే పాడే మోసే నలుగురిని సంపాదించు..

నువ్వు సచ్చిపోతే పాడే మోసే నలుగురిని సంపాదించు..

నీ కులము ధనము కోప క్రోధము మోయవు ఆ పాడెను…

ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి…

కాటిలోన కాలే కట్టెకు నీకు చివరి సోపతి…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Edi Radu Neeto Paatu Janapadam Song FAQ

What movie is Edi Radu Neeto Paatu Janapadam song from?

Edi Radu Neeto Paatu Janapadam song is from the movie.