
| Movie Name | Kurup ( ) |
|---|---|
| Director | Srinath Rajendran |
| Star Cast | Dulquer Salmaan, Sobhita Dhulipala |
| Music | Sushin Shyam |
| Singer(s) | Haripriya |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Saregama Telugu |
ఇది పరవశమో… తొలి కలవరమో
ఎద మలుపులలో… మెదిలిన స్వరమో
ఎద వణికినది… నిను పిలిచినది
నిను తలువగనే మదువొలికినది
అణువణువున ఓ అలజడి కలిగే
ఒక విరహములో వెచ్చంగా ఒదిగి
అణువే సంద్రమైనది ప్రియ సఖుడా
క్షీరసాగరమేగా అనురాగం
కసికసి తనువుల ప్రియరాగం
నిండు యవ్వనమేగా ఒక యోదం
వయసులు కలబడు సుఖభోగం
ప్రియుడా ప్రియుడ ప్రియతమా సఖుడా
కలలో ఇలలో నిను విడగలనా
సొగసుల భారం పెరిగినదోయి
సమరమే సఖుడా ప్రియమోయి
ఇది పరవశమో… తొలి కలవరమో
ఎద మలుపులలో… మెదిలిన స్వరమో
అణువణువున ఓ, హ్మ్ హ్మ్… అలజడి కలిగే, హ్మ్ హ్మ్
ఒక విరహములో వెచ్చంగా ఒదిగి
అణువే సంద్రమైనది ప్రియ సఖుడా
Edi Paravasamo song is from the Kurup ( ) movie.
Edi Paravasamo song was sung by Haripriya.
Edi Paravasamo song lyrics were written by Bhuvana Chandra.
Edi Paravasamo song music was composed by Sushin Shyam.