| Movie Name | & English - Manasulo Maata |
|---|---|
| Director | S V Krishna Reddy |
| Star Cast | Jagapati Babu, Srikanth, Mahima Chowdary |
| Music | SV Krishna Reddy |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు
ఏ రాగముంది మేలుకొని ఉండి
లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి
మూసుకొని ఉన్న చెవులను తెరువగ
సంగీతమంటె ఏవిటో తెలిసి
ఉండాలి మనకి ముందుగా అంత
సందేహముంటె తీర్చుకో గురువులున్నారు
కనుల ముందుగా వెల్లి
నీలి మేఘాన్ని గాలి వేగాన్ని
నింగి మౌనాన్ని అడగరా కడలి
ఆలపించేటి ఆ తరంగాల
అంతరంగాన్ని అడగరా
మధుర ప్రాణ గీతాన్ని పాడుతూ ఉన్న
ఎదసడినడిగితె శ్రుతిలయ తెలుపద
బ్రతుకును నడిపిన సంగతి తెలియద
ఏ రాగముంది మేలుకొని ఉండి
లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి
మూసుకొని ఉన్న చెవులను తెరువగ
ఏ సుప్రభాత గళముతో నేల
స్వాగతిస్తుంది తొలితొలి వెలుగుని
ఏ జోలపాట చలువతో నింగి
సేదదీర్చింది అలసిన పగటిని
స్వర్ణ తరుణాలు చంద్ర కిరణాలు
జిలుగులొలికి పరుగు పలుకునెవరికి
మంచు మౌనాలు పంచమంలోన
మధువు చిలుకు ఎవరి చెలిమి రవళికి
తోటలో చేరి పాట కచ్చేరి
చేయమంటున్న వినోదమెవరిది
వేల అందాల పూల గంధాల
చైత్రగాత్రాన సునాదమెవరిది
పంచవర్ణాల పింఛమై
నేల నాట్యమాడేటి వేళలో మురిసి
వర్ష మేఘాల హర్ష రాగాలు
వాద్యమయ్యేటి లీలలో తడిసి
నీరుగా నీరు ఏరుగా ఏరువాకగా
నారు చిగురులు తొడగగ
పైరు పైటేసి పుడమి పాడేటి
పసిడి సంక్రాంతి పదగతులెవరివి
ఆరు కాలాలు ఏడు స్వరములతొ
అందజేస్తున్న రసమయ మధురిమ
వినగల చెవులను కలిగిన హృదయము
తన ప్రతి పధమున చిలకద సుధలను
జోహారు నీకు సంద్రమా ఎంత ఓపికో
అసలు అలసట కలగద
ఓహోహొ గాన గ్రంధమా ఎంత సాధనో
దిశల ఎదలకు తెలియద
నీ గీతమెంత తడిమినా
శిలలు సంగీత కళలు కావనీ ఎంత
నాదామృతాన తడిసినా ఇసుక
రవ్వంత కరగలేదనీ తెలిసి
అస్తమిస్తున్న సూర్య తేజాన్ని కడుపులో మోసి
నిత్యము కొత్త ఆయువిస్తున్న
అమృతం లాంటి ఆశతో ఎగసి
ఆవిరై అష్ట దిక్కులూ దాటి
మబ్బులను మీటి… నిలువున నిమిరితె
గగనము కరగద జలజల చినుకుల సిరులను
కురవగ అణువణువణువున తొణికితె స్వరసుధ
అడుగడుగడుగున మధువని విరియదా, ఆ ఆ హా ఆ
E Ragamundi song is from the & English - Manasulo Maata movie.
E Ragamundi song was sung by S P Balasubramanyam.
E Ragamundi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
E Ragamundi song music was composed by SV Krishna Reddy.