
| Movie Name | & English - Savitri Vs Satyamu |
|---|---|
| Director | Chaithanya Konda |
| Star Cast | Parvateesham, Sri Lakshmi |
| Music | Satya Kashyap |
| Singer(s) | Divya Malika |
| Lyricist | Pranavam |
| Music Label | Aditya Music |
దొరసానినే చేశాడే… దొరబాబే వీడు
నా ఆశ శ్వాస అంతా ఇతడేలే
దొరసానినే చేశాడే… దొరబాబే వీడు
నా ఆశ శ్వాస అంతా ఇతడేలే
చూపాడే లోకాన్నే… కొత్తగా తన జతలో
నా జీవితం ఇంకా స్వర్గంలే
కలతేమో కలగా మారే… కలలన్నీ నిజమైనాయే
కన్నులలో వెన్నెల పూసే… కాలం ఎంతో బాగుందే
చైత్రాలే వీడవు క్షణమే… చిత్రాలే మనసుకు వరమే
సంతోషం జతగా చేరి… సంబరమల్లే మురిసినదే
దొరసానినే చేశాడే… దొరబాబే వీడు, దొరబాబే వీడు
ప్రేమల లోతును… సూటిగా చూసిన
సుందర చూపుల రాముడులే
చీకటి తీసి పున్నమిని పూసి
దిగులే రాని దారులని చూపి
సంతోషాల రంగుల్ని వేసి
శ్వాసలో శ్వాసై కలిసాడే
ఊహలకేమో రెక్కల్ని ఇచ్చి
స్వేచ్ఛగా ఎగిరే ధిక్కల్లే వచ్చి
మునుపే లేని వింతలని తెచ్చి
పరవశమెంతో పెంచాడే
దొరసానినే చేశాడే… దొరబాబే వీడు, దొరబాబే వీడు
అందరు ఉండగా పండగ నిండుగా
సందడులెన్నో నింపాడే
అనుబంధాలు అచ్చెరువు ఒలికే
అనురాగాల రుచి ఎంతో తెలిసే
సరదాలెన్నో గలగల నదిలా పొంగాయే నాలోనే
అమ్మగా మారే అదృష్టం కలిసి
తరగని వరము ఎదురంట నిలిచి
ఇంతకుమించి ఏ సౌఖ్యమైన చిన్నదిగా తోచిందే
దొరసానినే చేశాడే… దొరబాబే వీడు, దొరబాబే వీడు
దొరసానినే చేశాడే… దొరబాబే వీడు
నా ఆశ శ్వాస అంతా ఇతడేలే
Dorasanine Cheshade song is from the & English - Savitri Vs Satyamu movie.
Dorasanine Cheshade song was sung by Divya Malika.
Dorasanine Cheshade song lyrics were written by Pranavam.
Dorasanine Cheshade song music was composed by Satya Kashyap.