
| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | K Y Ratnam |
| Singer(s) | Ramya Behra |
| Lyricist | Purushottam Babu |
| Music Label | Gnana Rekhalu |
వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్
దివ్య తార… దివ్య తార
దివి నుండి దిగి వచ్చిన తార ||2||
వెలుగైన యేసయ్యను… వేనోళ్ళ చాటినది ||2||
పశుల పాక చేరినది… క్రిస్మస్ తార ||2|| //దివ్య తార//
జన్మించె యేసు రాజు… పరవశించె పరలోకం ||2||
మధురమైన పాటలతో మారుమ్రోగెను
క్రీస్తు జన్మమే… పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే ||2||
తార తార… క్రిస్మస్ తార
తార తార… దివ్య తార ||2|| //దివ్య తార//
ప్రభు యేసు నామం… ప్రజా సంఖ్యలోనున్నది ||2||
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతి లేని జీవితాన… కాంతి పుంజమే ||2||
తార తార… క్రిస్మస్ తార
తార తార… దివ్య తార ||2|| //దివ్య తార//
పాపలోక జీవితం… పటాపంచలైనది ||2||
నీతియై లోకంలో వికసించినది
క్రీస్తు జన్మమే ప్రేమామయమే
చీకటి హృదయాలలో… వెలుగు తేజమే ||2||
తార తార… క్రిస్మస్ తార
తార తార… దివ్య తార ||2|| //దివ్య తార//
Divya Tara song is from the movie.
Divya Tara song was sung by Ramya Behra.
Divya Tara song lyrics were written by Purushottam Babu.
Divya Tara song music was composed by K Y Ratnam.